అడ్డుకోవడం క్రిమినల్ చర్య.... లోకేష్

Published: Thursday December 12, 2019
అమరావతి: à°¶à°¾à°¸à°¨à°®à°‚డలి ప్రారంభం నుంచే సభ్యులను అగౌరవపరిచే రీతిలో మార్షల్స్ వ్యవహరిస్తున్నారని, సభ్యులను అడ్డుకునే అధికారం మార్షల్స్‌కు ఎవరిచ్చారని టీడీపీ ఎమ్మెల్సీ, మాజీ మంత్రి నారా లోకేష్ ప్రశ్నించారు. మండలిలో ఆయన మాట్లాడుతూ ఇదే తీరు కొనసాగితే తాము శాసనమండలికి వచ్చే పరిస్ధితి ఉండదని అన్నారు. మహిళల పట్ల మార్షల్స్ అవమానకరంగా ప్రవర్తిస్తున్నారని అన్నారు.
 
ఎప్పుడూ లేని విధంగా సభ్యులను గేటువద్దే నిరోధించడం అసమంజసమని, యనమల రామకృష్ణుడు, మెంబర్స్‌ను అడ్డుకోవడం క్రిమినల్ చర్యగా లోకేష్ అభివర్ణించారు. సభ్యులను అడ్డుకుంటే తాము రామని, సభను మీరే నడుపుకోండని అన్నారు. రెండు అటానమస్ బాడీలకు ప్రత్యేక అధికారాలు ఉంటాయన్నారు. ఫ్లోర్ లీడర్లు, లెజిస్లేటివ్ వ్యవహారాల మంత్రి, ఛీఫ్ మార్షల్‌ను పిలిపించి మాట్లాడాలని ఆయన డిమాండ్ చేశారు. లోకేష్ వ్యాఖ్యలపై స్పందించిన శాసనమండలి చైర్మన్ షరీఫ్..సభ్యుల పట్ల అగౌరవంగా ప్రవర్తించడం అసమంజసమని అన్నారు. సభ్యులను మార్షల్స్ అగౌరవ పరచకుండా ఉండే విధంగా రూలింగ్ ఇస్తున్నామన్నారు. ఆడవారిని ఆడవారే, మగవారిని మగవారే తాకకుండా సభకు పంపించాలని ఛీఫ్ మార్షల్‌కు ఆదేశాలు జారీ చేస్తూ.. ఫ్లోర్ లీడర్లు, లెజిస్లేటివ్ వ్యవహారాల మంత్రి, ఛీఫ్ మార్షల్‌ను పిలిపించి మాట్లాడుతామని చెప్పడంతో ప్రశ్నోత్తరాలు ప్రారంభమయ్యాయి.