ఇతర పార్టీలు మాటలు నమ్మి మోసపోవద్దు
Published: Sunday January 12, 2020

అమరావతిని ఎత్తేస్తామని సీఎం వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి ఎప్పుడూ చెప్పలేదని మంత్రి అవంతి శ్రీనివాస్ చెప్పుకొచ్చారు. జనసేన అధినేత పవన్ కల్యాణ్ కవాతులు నిర్వహిస్తే టీడీపీ అధినేత చంద్రబాబు ఇంటి ముందు నిర్వహించాలన్నారు. అమరావతి పేరుతో ఇతర జిల్లాలను విస్మరించింది చంద్రబాబేనన్నారు.
చంద్రబాబు అండ్ కో చేసిన అరాచకాలు అన్ని ఇన్ని కావు.కావాలనే చంద్రబాబు రాజధాని ప్రజలను రెచ్చగొడుతూన్నాడు. అన్ని ఒక చోటే ఉంటే రాష్ట్ర అభివృద్ధి ఎలా సాధ్యమవుతుంది?. రాజధాని రైతులకి ప్రభుత్వం అండగా ఉంటుంది..ఇతర పార్టీలు మాటలు నమ్మి మోసపోవద్దు. రాజధాని తరలింపు చీకటిలో చేసేది కాదు. 20న శాసనసభలో చర్చించే నిర్ణయం ఉంటుంది. మహిళా కమిషన్ సభ్యులు విచారణ చేయటంలో తప్పులేదు. మేము ఏమీ తప్పు చేయలేదు. రైతులందరితో చర్చించి వారికి తగిన న్యాయం చేస్తాం’ అని మంత్రి అవంతి హామీ ఇచ్చారు.

Share this on your social network: