విజయసాయి ట్వీట్‌కు రామ్మోహన్ కౌంటర్

Published: Thursday June 11, 2020

దివంగత ఎంపీ ఎర్రంనాయుడు కుమారుడు, తెలుగుదేశం పార్టీ యువ ఎంపీ రామ్మోహన్ నాయుడు తొలిసారి à°“ సంచలన ట్వీట్ చేశారు. తనపై వచ్చే విమర్శలకు ఇప్పటి వరకు పెద్దగా స్పందించని రామ్మోహన్.. ఫస్ట్ టైమ్.. వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి చేసిన వ్యాఖ్యలకు ఘాటుగా కౌంటర్ ఇచ్చారు. మాటకు మాట బదులిచ్చి తన సహనాన్ని పరీక్షించవద్దంటూ పరోక్షంగా హెచ్చరించారు. అసలు విషయం ఏంటో ఇప్పుడు  చూద్దాం..

https://youtu.be/TMehN0lwx60

‘‘కొడుకేమో ‘తిండికి తిమ్మరాజు పనికి పోతురాజు’. సీనియర్లంతా చేతులెత్తేసారు. ఎవరైతే ఏంటని 32 ఏళ్ల రామ్మోహన్‌కు ముళ్ల కిరీటం తగిలిస్తున్నాడు బాబు గారు. రాజధాని కాకుండా విశాఖను అడ్డుకోజూసి నవ్వుల పాలయ్యాడు. ఉత్తరాంధ్ర ప్రజలను బుజ్జగించాలని అమాయకుడిని బలి పీఠం ఎక్కిస్తున్నాడు.’’ అంటూ రామ్మోహన్‌ నాయుడిపై వైసీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి ట్వీట్ చేశారు.

తన ట్వీట్‌తో టీడీపీని ఇరాకాటంలోకి నెట్టేసి పబ్బం గడుపుకోవచ్చనే విజయసాయిరెడ్డి ఆలోచనను గ్రహించిన టీడీపీ ఎంపీ రామ్మోహన్ నాయుడు అదే స్థాయిలో కౌంటర్ ట్వీట్ చేశారు. ‘‘అల్లుడేమో అవినీతికి తిమ్మరాజు పనికి పోతురాజు.సీనియర్లు అందరూ చేతగానోడి పాలన చూసి ''ఛీ'' కొడుతున్నారు.కారు దించేశారనే కక్షతో మామ అప్రూవర్ à°—à°¾ మారి అల్లుడిని కుర్చీ నుండి దించేయాలని కుట్ర మొదలెట్టాడు.ప్రత్యేక హోదా పై చేతులెత్తేశారు, ఉత్తరాంధ్ర రైల్వే జోన్ పట్టాలెక్కించడం చేతకాలేదు. మూడుముక్కలాట మొదలెట్టి మూతిముడుచుకొని కూర్చోవడం తప్ప ఏడాదిలో మామ, అల్లుడి వలన ఏ ప్రాంతానికి ఒరిగింది ఏమి లేదు.ఢిల్లీలో కాళ్లు మొక్కడం,ట్విట్టర్ లో రెచ్చిపోవడం మాని రాష్ట్ర సమస్యల పరిష్కారం కోసం పార్లమెంట్ లో కృషి చేస్తే ప్రజలు హర్షిస్తారు  విజయసాయిరెడ్డి గారు.’’ అంటూ రామ్మోహన్ ఘాటుగానే జవాబిచ్చారు. జగన్‌, విజయసాయిని మామఅల్లుళ్లు అంటూ సంచలన కామెంట్ చేశారు.

టీటీపీ అధినేత చంద్రబాబు à°† పార్టీ బాధ్యతలను నారా లోకేష్‌కు అప్పగించడం ఇష్టం లేక రామ్మోహన్ నాయుడికి బాధ్యతలు ఇస్తున్నారంటూ వైసీపీ నేత విజయసాయిరెడ్డి ఊహాగానాలు సృష్టించారు. అధికార పార్టీ లోపాలను ఎత్తిచూపుతున్న ప్రతిపక్షాన్ని ఏదో à°’à°• విధంగా ఇరకాటంలోకి నెట్టాలని ప్రయత్నించిన విజయసాయి కుట్రలను రామ్మోహన్ ట్వీట్‌తో తిప్పికొట్టినట్టు అయిందని టీడీపీ నేతలు, కార్యకర్తలు భావిస్తున్నారు.