వైఎస్ జగన్ ప్రతాపం ఇదేనా

Published: Friday June 12, 2020

 à°®à°¾à°œà±€ మంత్రి, టీడీపీ సీనియర్ నేత తన బాబాయి అచ్చెన్నాయుడు అరెస్టుపై టీడీపీ ఎంపీ రామ్మోహన్ నాయుడు స్పందించారు. శుక్రవారం ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ.. వైఎస్ జగన్ ప్రతాపం ఇదేనా అని ప్రశ్నించారు. అచ్చెన్నాయుడిని 151 మంది ఎమ్మెల్యేలు  à°Žà°¦à±à°°à±à°•à±‹à°²à±‡à°• à°ˆ రకమైన చర్యలకు పాల్పడ్డారని ఆరోపించారు. ప్రతిపక్షంలో ఉన్న టీడీపీలో భయాన్ని సృష్టించడానికి, ప్రశ్నించకూడదు అన్న ధోరణిలో వెళుతున్నారని విమర్శించారు. అచ్చెన్నాయుడు అరెస్టుకు జగన్ సూత్రధారి అని, పగబట్టారని తీవ్రస్థాయిలో వ్యాఖ్యానించారు. ఇదే ఇష్యూపై గతంలో మొదట ప్రెస్ మీట్ పెట్టిందే అచ్చెన్నాయుడని, ఆరోపణలపై అప్పట్లోనే సమాధనాం ఇచ్చారన్నారు. టీడీపీ ప్రధాన గొంతుక అచ్చెన్నాయుడని, à°ˆ ప్రభుత్వానికి ఫ్యాక్షన్ రాజకీయాలు, విధ్వంసం చేయడం తప్ప మరొకటి లేదన్నారు. సబ్జెక్ట్ పై మాట్లాడితే.. వాళ్ల దగ్గర సమాధానం లేదన్నారు. కేసులపై జగన్ మోహన్ రెడ్డికి అవగాహన ఉందన్నారు. సంవత్సరం కాలంగా సుప్రీం కోర్టు మొట్టికాయలు మొత్తుతూనే ఉందన్నారు. ఫాల్స్ కేసు సృష్టించి అరెస్ట్ చేశారన్నారు. కేంద్రం తరఫున ఈఎస్ఐకీ నిధులు వస్తాయని, తక్కువ ధరకే మందులు కొన్న రాష్ట్రం ఏపీ అన్నారు. అందులో ఏమైనా తప్పులు జరిగితే... సెంట్రల్ అధికారులు చూసుకుంటారని, రాష్ట్రం పరిధిలోకి రాదని.. ఏవైనా జరిగితే.. కేంద్రం à°† నివేదకలను అప్రూవ్ చేయదని కుండబద్ధలు కొట్టారు.