శంకుస్థాపన చేసే హక్కు శాసనసభ్యుడికి లేదా?

Published: Monday June 15, 2020

 à°µà°¿à°¶à°¾à°–పట్నంలో ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణపై జరిగిన దాడిని టీడీపీ అధినేత చంద్రబాబు ఖండించారు. à°ˆ మేరకు పత్రికా ప్రకటన విడుదల చేశారు. ఆయన ప్రాతినిథ్యం వహిస్తున్న విశాఖ తూర్పు నియోజకవర్గంలో అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనివ్వకుండా ఎమ్మెల్యే రామకృష్ణ బాబును అడ్డుకోవడంపై చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో రోజు రోజుకూ వైసీపీ గుండాల అరాచకాలు పెరిగిపోతున్నాయని అన్నారు. తన నియోజకవర్గంలో సీసీ రోడ్డు పనులకు శంకుస్థాపన చేసే హక్కు శాసనసభ్యుడికి లేదా? అని చంద్రబాబు ప్రశ్నించారు. పౌరుల ప్రాథమిక హక్కులను కాలరాస్తున్నారని ధ్వజమెత్తారు. రాజ్యాంగ నిబంధనలను యధేచ్చగా ఉల్లంఘిస్తున్నారని మండిపడ్డారు. ఇప్పుడు శాసన సభ్యుల హక్కులనూ హరించడం హేయమైన చర్య అని పేర్కొన్నారు. విశాఖ దాడిలో గాయపడిన టీడీపీ కార్యకర్తకు మెరుగైన చికిత్స అందించాలని, దాడికి పాల్పడిన నిందితులపై à°•à° à°¿à°¨ చర్యలు తీసుకోవాలని చంద్రబాబు డిమాండ్ చేశారు. కాగా, అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేసేందుకు తన అనుచరులతో వెళ్లిన ఎమ్మెల్యే రామకృష్ణ బాబుపై వైసీపీ వర్గీయులు రాళ్లతో దాడి చేసిన విషయం తెలిసిందే.