ప్రధాని వీడియో కాన్ఫరెన్స్

Published: Tuesday June 16, 2020

 వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ప్రధాని మోదీ తలపెట్టిన వీడియో కాన్ఫరెన్స్ ప్రారంభమైంది. జూన్ 30 తర్వాత తీసుకోవలసిన చర్యలపై ఆయన చర్చిస్తున్నారు. కరోనా వైరస్ వ్యాప్తి, అలాగే కేంద్రం తీసుకుంటున్న చర్యలను వివరిస్తున్నారు. లాక్‌డౌన్ సందర్భంగా వ్యవసాయం, తదితర రంగాలకు కల్పించిన ప్రయోజనాలను ప్రధాని చెబుతున్నారు. వివిధ రాష్ట్రాల్లోని పరిస్థితులపై ముఖ్యమంత్రులను వివరాలు అడిగి తెలుసుకోనున్నారు. 21 రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. లాక్‌డౌన్ ప్రారంభమైనప్పటి నుంచి ముఖ్యమంత్రులతో ప్రధాని జరుపుతున్న ఆరో వీడియో కాన్ఫరెన్స్ ఇది.