అవినీతి జరిగిందని అధికార పార్టీ ఎమ్మెల్యేనే గళమెత్తారు

Published: Sunday June 21, 2020

ఆ జిల్లాలో పేదలకు పంపిణీ చేసే భూముల కొనుగోలులో అవినీతి జరిగిందని అధికార పార్టీ ఎమ్మెల్యేనే గళమెత్తారు. ప్రతిపక్ష పార్టీల నాయకులు కూడా పెద్దఎత్తున అవినీతి జరిగిందని ముక్తకంఠంతో ఆరోపిస్తున్నారు. వెంటనే విచారణ జరపాలని డిమాండ్ చేస్తున్నారు. మరి ప్రభుత్వ పెద్దలు ఎందుకు మీనమేషాలు లెక్కిస్తున్నారు? ఆ అవినీతి తంతుని చూసీచూడనట్లుగా వ్యవహరించడంలో ఆంతర్యం ఏంటి? తెలుసుకోవాలంటే ఈ కథనంలోకి వెళ్లండి.

 

   à°¤à±‚ర్పు గోదావరి జిల్లా రాజానగరం నియోజకవర్గంలో పేదలకు పంపిణీ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం భూములు కొనుగోలు చేసింది. అధికార వైసీపీకి చెందిన నేతల కనుసన్నల్లోనే అధికారులు భూములను కొనుగోలు చేశారు. రైతులకు సొమ్ములు చెల్లించారు. అంతా ఎవరికీ తెలియకుండా సజావుగా సాగిపోతుందనుకున్న సమయంలో స్థానిక ఎమ్మెల్యే జక్కంపూడి రాజా తేనెతుట్టెను కదిల్చారు. ఆవ భూముల కొనుగోలుపై ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. కోరుకొండ మండలం బూరుగుపూడి, కాపవరం గ్రామాల్లో కొనుగోలు చేసిన భూములు నివాసయోగ్యం కావనీ, à°† భూముల కొనుగోలులో అవినీతి జరిగిందనీ జక్కంపూడి రాజా ఆరోపించారు. అధికారులు తనను సంప్రదించకుండానే వాటిని కొనుగోలు చేశారని ఆయన చెప్పారు. భూముల కొనుగోలులో అక్రమాలపై ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి ఫిర్యాదు చేసినట్టు ప్రకటించారు. దీంతో భూముల కుంభకోణం తెరపైకి వచ్చింది.

 

    భూముల కొనుగోలులో కుంభకోణంపై రాజమండ్రి ఎంపీ మార్గాని భరత్ కూడా స్పందించారు. రాజానగరం నియోజకవర్గంలో పేదలకు పంపిణీ చేసేందుకు కొనుగోలు చేసిన భూముల విషయంలో తనపై కొందరు బురద జల్లుతున్నారనీ, à°ˆ విషయాన్ని తాను కూడా ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళతాననీ ఆయన తెలిపారు. మరోవైపు భూముల కుంభకోణంపై టీడీపీ, బీజేపీసహా ఇతర రాజకీయ పార్టీల నేతలు మండిపడుతున్నారు. వైసీపీ నేతల కనుసన్నల్లోనే నివాసయోగ్యం కాని ముంపుభూములను కొనుగోలు చేశారని ఆరోపిస్తున్నారు. à°ˆ వ్యవహారంపై వెంటనే ముఖ్యమంత్రి జగన్ స్పందించాలని బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు డిమాండ్ చేశారు. à°Žà°•à°°à°‚ భూమి విలువ 20 లక్షలు ఉంటే అధికారులు ఎకరానికి 45 లక్షల రూపాయలు ఎలా చెల్లించారు? అని అధికారులను నిలదీశారు. రాష్ట్ర ప్రభుత్వం స్పందించనిపక్షంలో అన్ని రాజకీయ పార్టీలతో కలిసి బీజేపీ ఉద్యమం చేపడుతుందని స్పష్టం చేశారు.