షోకాజ్ నోటీస్‌కు సమాధానంగా.. ప్రశ్నల వర్షం

పార్టీ ఎమ్మెల్యేలపై విమర్శలకు పాల్పడుతున్నారని.. పార్టీ విధానాలకు వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నారని ఎంపీ రఘురామకృష్ణంరాజుకు వైసీపీ బుధవారం షోకాజ్ నోటీసు జారీ చేసిన విషయం తెలిసిందే. ఆ షోకాజ్ నోటీసుకు రఘురామ కృష్ణంరాజు సమాధానమిచ్చారు. పార్టీ తరుఫున షోకాజ్ నోటీస్ పంపిన విజయసాయిరెడ్డిపై ప్రశ్నల వర్షం కురిపించారు.
‘‘వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అని ఎలా ఉంటుంది? వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పేరుతో షోకాజ్ నోటీస్ ఎలా ఇస్తారు? వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పేరుతో వచ్చిన ఈ షోకాజ్‌కు చట్టబద్ధత లేదు. రాష్ట్ర స్థాయి గుర్తింపు పొందిన పార్టీకి జాతీయ ప్రధాన కార్యదర్శి ఎలా ఉంటారు? వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో క్రమశిక్షణ సంఘం ఉందా? క్రమశిక్షణ సంఘానికి ఎన్నికల గుర్తింపు ఉందా? క్రమశిక్షణ సంఘానికి ఛైర్మన్, సభ్యులెవరు? మీటింగ్ ఎప్పుడు పెట్టారు? ఏమి తీర్మానం చేశారో తెలియజేయండి. క్రమశిక్షణ సంఘం మినిట్స్ నాకు పంపండి. షోకాజ్ ఎవరు జారీ చెయ్యాలి? ప్రొసీజర్ తెలుసా?’’ అని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డిని రఘురామ కృష్ణంరాజు సూటిగా నిలదీశారు. దీనికి సంబంధించి ప్రజాప్రాతినిధ్య చట్టం (1951) IV-A భాగం, సెక్షన్ 29 ఎలోని 1వ అంశాన్ని లేవనెత్తారు.

Share this on your social network: