ఎంపీ రఘురామ కృష్ణరాజుపై అనర్హత వేటుకు వైసీపీ ఎంపీలు ప్రయత్నాలు

Published: Thursday July 02, 2020

వైసీపీ రెబల్ ఎంపీ రఘురామ కృష్ణరాజుపై అనర్హత వేటుకు వైసీపీ ఎంపీలు ప్రయత్నాలు చేస్తున్న నేపథ్యంలో ఆయన విమర్శలు కురిపించారు. సీఎం జగన్‌ను పొగుడుతూనే వైసీపీ ఎంపీలను సుతిమెత్తంగా ఏకి పారేశారు. వైసీపీ ఎంపీలు విమానంలో ఢిల్లీ వెళ్లి à°“à°‚ బిర్లాను కలవాలనుకోవడంపై కూడా రఘురామకృష్ణంరాజు వ్యంగాస్త్రాలు సంధించారు.

‘‘ప్రభుత్వ విమానం ఖాళీగా ఉంది.. వైసీపీ ఎంపీలు తిరుగుతున్నారు. ప్రభుత్వానికి ఖర్చు తప్ప ఏమీ ఉండదు. ప్రభుత్వ విమానంలో ఢిల్లీలో వెళ్లి వైసీపీ ఎంపీలు ఫిర్యాదు చేయడమేంటి?. మెయిల్ ద్వారా పంపొచ్చు. ఏదో షో చేసుకుంటున్నారు అంతే. ఇదంతా పార్టీ వ్యూహం.. ప్రభుత్వం ఖర్చులో వెళ్లిపోతుంది. ఎంపీలు ఢిల్లీ వెళ్లిన ఖర్చును పార్టీ ఖర్చులో రాస్తారో.. ప్రభుత్వం ఖర్చులో రాస్తారో చూడాలి. నేను మా ముఖ్యమంత్రిని గౌరవిస్తున్నాను. పార్టీ పల్లెత్తు మాట అనలేదు. పార్టీలోని కొందరు.. దేవుడు భూములను అమ్ముకుందామనుకుంటున్నారు. ఇవాళ చిన్న భూమితో ప్రారంభమవుతుంది. భవిష్యత్తులో రాష్ట్రంతో పాటు దేశం మొత్తం కూడా ఇలానే జరుగుతుంది. అలా జరగకూడదని ముఖ్యమంత్రి జగన్‌కు తెలియజేశా. ఆయన పెద్ద మనసుతో ఆపడం జరిగింది. ఇసుకతో పాటు à°’à°•à°Ÿà°¿, రెండు విషయాలు కూడా చెప్పా. పార్టీలో పెద్దలు దేవుడు భూములు అమ్ముకుంటున్నారని చెప్పలేదు, ఇళ్ల స్థలాల్లో గోల్‌మాల్ చేస్తున్నారని నేను చెప్పలేదు. ముఖ్యమంత్రి జగన్ దృష్టికి తీసుకెళ్లా. పార్టీకి ఎందుకు కోపం వచ్చిందో. పార్టీ నాకు ఎందుకు షోకాజ్ నోటిస్ ఇచ్చిందో. కుంభకోణాలకు, పార్టీకి ఏం సంబంధమో నాకు అర్ధం కావడంలేదు.’’ అని అన్నారు. 

వైసీపీ రెబల్ ఎంపీ రఘురామ కృష్ణరాజుపై అనర్హత వేటుకు వైసీపీ ఎంపీలు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇందులోభాగంగా శుక్రవారం à°† పార్టీ ఎంపీలు లోక్‌సభ స్పీకర్‌ à°“à°‚ బిర్లాతో భేటీ కావాలని అనుకున్నారు. వైసీపీ ఎంపీలకు స్పీకర్‌ అపాయింట్‌మెంట్ కూడా ఇచ్చారు. రేపు స్పీకర్‌‌నును వైసీపీ ఎంపీలు కలవనున్నారు. రఘురామ కృష్ణరాజుపై అనర్హత వేటు వేయాలంటూ వారు స్పీకర్‌కు లేఖ ఇవ్వనున్నారు. శుక్రవారం విజయవాడ నుంచి ప్రత్యేక విమానంలో ఢిల్లీకి వైసీపీ ఎంపీలు, లాయర్లు వెళ్తారు. 

 

రేపు మధ్యాహ్నం స్పీకర్‌ను ఎంపీలు కలుస్తారని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. ఇప్పటికే ముగ్గురు వైసీపీ ఎంపీలు స్పీకర్‌ను కలిసినట్లు సమాచారం. రఘురామ కృష్ణరాజు వ్యవహారంపై స్పీకర్‌తో వారు సమాలోచనలు చేసినట్లు ఢిల్లీ వర్గాల నుంచి తెలుస్తోంది.