బీసీలపై ప్రభుత్వం కక్షసాధింపు: కొనకళ్ల

Published: Monday July 06, 2020

ప్రజలకు వాస్తవాలు చెబుతున్న మాజీ మంత్రులను సీఎం జగన్‌ అరెస్టు చేయిస్తున్నారని మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ఆరోపించారు.  మాజీ మంత్రి కొల్లు రవీంద్ర కుటుంబసభ్యులను ఆదివారం దేవినేని ఉమాతో పాటు మాజీ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య, తెలుగు మహిళ ఆచంట సునీత, ఎమ్మెల్సీ బచ్చుల అర్జునుడు, మాజీ ఎంపీ కొనకళ్ల నారాయణరావు తదితరులు పరామర్శించారు. అనంతరం దేవినేని ఉమా మీడియాతో మాట్లాడుతూ అక్రమ అరెస్టులకు భయపడేది లేదన్నారు. హత్య జరిగిన 4 గంటల్లోనే నోటీసులు ఇవ్వకుండా కొల్లు రవీంద్రను ఏ4à°—à°¾ నమోదు చేశారని, ఎఫ్‌ఐఆర్‌లో ఆయన పేరు చేర్చిన సంగతి గోప్యంగా ఉంచారని ఆరోపించారు. దీంతో రవీంద్ర విశాఖపట్నానికి ప్రయాణమయ్యారని, గోడదూకి వెళ్లిన మాట అసత్యమని, పారిపోయేంత పిరికిపంద కాదని పేర్కొన్నారు. కావాలంటే ఇంటి ముందు సీసీ కెమెరాలు పరిశీలించుకోవాలన్నారు. వైసీపీ ప్రభుత్వం మాజీ మంత్రులను అక్రమ కేసుల్లో ఇరికించడమే లక్ష్యంగా పెట్టుకుందన్నారు.  ఎక్కడికక్కడ అవినీతిని విమర్శించిన టీడీపీ నాయకులపై వేధింపు చర్యలు ప్రారంభించారన్నారు. లొంగిపోయి వైసీపీలో చేరితే వేధింపులు మానుతున్నారన్నారు.