శిశుపాలుడిలా కేసీఆర్ తప్పులు..

Published: Tuesday July 07, 2020

శిశుపాలుడి మాదిరి తెలంగాణ సీఎం కేసీఆర్ తప్పులు రోజురోజుకు పెరిగిపోతున్నాయని తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ ప్రచార కమిటీ చైర్‌పర్సన్ విజయశాంతి మండిపడ్డారు.  ఇంతకాలం ప్రజాతీర్పు తనకు అనుకూలంగా ఉందని విర్రవీగిన పోయిన కేసీఆర్... త్వరలో తెలంగాణ ప్రజల తిరస్కారాన్ని, తిరుగుబాటును ఎదుర్కొనే రోజులు దగ్గర్లోనే ఉన్నాయన్నారు. తాజా పరిణామాలను చూస్తుంటే ఇదే అర్థం అవుతోందన్నారు. సోషల్ మీడియా వేదికగా తన అభిప్రాయాన్ని వ్యక్తం చేసిన ఆమె.. ప్రతి విషయంలోనూ ఉచిత సలహాలు ఇస్తూ, మాయమాటలు చెప్పి, తనను మేధావిగా ప్రదర్శించుకునే ప్రయత్నం చేసే కేసీఆర్... కరోనా మహమ్మారిని కట్టడి చేసే విషయంలో చేతులెత్తేసి, అజ్ఞాతంలోకి వెళ్లిపోవడం ఇప్పుడు రాష్ట్రంలో హాట్ టాపిక్‌à°—à°¾ మారిందని వ్యాఖ్యానించారు. కరోనా విషయంలో నిర్లక్ష్యం తగదని ప్రతిపక్షాలు హెచ్చరిస్తే సీఎం దాన్ని అవహేళన చేశారన్నారు. కరోనా కట్టడికి తగిన వైద్య వసతులు లేవని పత్రికల్లో వార్తలు వస్తే.. వాటి యాజమాన్యంపై కేసీఆర్ శాపనార్థాలు పెట్టారని గుర్తు చేశారు. కరోనా పరీక్షల విషయంలో రాష్ట్ర ప్రభుత్వ అలసత్వాన్ని తెలంగాణ హైకోర్టు తప్పుపట్టినా... సీఎం దాన్ని ఏమాత్రం పట్టించుకోలేదన్నారు. ఇక పరిస్థితి చేయి దాటి పోతుందని గ్రహించి, తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ స్వయంగా జోక్యం చేసుకుని, సంక్షోభ నివారణకు చొరవ తీసుకుంటే... దానిని కూడా సీఎం అడ్డుకోవడం నిరంకుశత్వానికి పరాకాష్ట అన్న విమర్శలు వినిపిస్తున్నాయని పేర్కొన్నారు. ముఖ్యమంత్రిగా కేసీఆర్ తన బాధ్యతలను నిర్వర్తించడంలో విఫలమైన కారణంగా, గవర్నర్ జోక్యం చేసుకోవడాన్ని తెలంగాణ ప్రజలు సైతం స్వాగతిస్తున్నారన్నారు. à°ˆ విషయంలో అనవసర రాద్ధాంతం చేయడం కంటే, సీఎం కేసీఆర్ ప్రజలకు భరోసా ఇచ్చే విధంగా చర్యలు తీసుకోవడం మేలన్నారు. లేనిపక్షంలో తెలంగాణ సమాజ ఆగ్రహ జ్వాలలు తారస్థాయికి చేరుతాయనడంలో సందేహం లేదని విజయశాంతి అన్నారు.