రానున్న ఎన్నికల్లో టీడీపీ 140 సీట్లు కైవసం'''''''''

Published: Tuesday May 22, 2018

కొవ్వూరు/ఏలూరు : ఎటువంటి పొత్తు లేకుండా రానున్న ఎన్నికల్లో టీడీపీ 140 సీట్లు కైవసం చేసుకుంటుందని ఎక్సైజ్‌ శాఖ మంత్రి కె.ఎస్‌.జవహర్‌ ధీమా వ్యక్తం చేశారు. కొవ్వూరులోని లిటరరీ క్లబ్‌ కల్యాణ మండపంలో టీడీపీ నియోజకవర్గ స్థాయి మినీ మహా నాడు సోమవారం నిర్వహించారు. సభలో జవహర్‌ మాట్లాడుతూ ప్రస్తుతం రాష్ట్రంలో అప్రమత్తంగా ఉండాల్సిన సమయం ఆసన్నమైం దన్నారు. జగన్మోహనరెడ్డి ప్రజా సంకల్ప యాత్ర పేరుతో ముద్దుల యాత్ర చేస్తున్నాడన్నారు. భావితరాల అభివృద్ధికి సీఎం చంద్రబాబు నాయుడుకు మరో పదేళ్లు అధికారం కట్టబెట్టాలన్నారు. సీఎం చంద్ర బాబు ఆధ్వర్యంలో జరుగుతున్న అభివృద్ధికి ప్రజలు పట్టం కడతారన్నారు. రాజమహేంద్రవరం ఎంపీ మాగంటి మురళీ మోహన్‌ మా ట్లాడుతూ ఎన్నికల ముందు ప్రధాని మోదీ తిరుపతిలో ఏపీకి ప్రత్యే à°• హోదా ఇస్తామని హామీ ఇచ్చి మాట తప్పారన్నారు. అవినీతిని నిర్మూలిస్తామన్న మోదీ అమలులో పూర్తిగా విఫలమయ్యారని అన్నారు.

బీజేపీ నాయకులకు రాజకీయ కాంక్ష పెరిగిపోయి అకృత్యా లకు పాల్పడుతున్నారని దుయ్యబట్టారు. కర్ణాటక ఎన్నికల్లో మెజార్టీ అందించకపోయినప్పటికీ అధికారం కోసం వేసిన ఎత్తుగడ విఫల మైందని అన్నారు. ప్రత్యేక హోదా విషయంలో వైసీపీ రాష్ట్రంలో à°’à°• మాట కేంద్రంలో మారో మాట మాట్లాడుతోందన్నారు. ప్రజలను మభ్యపెట్టేందుకు పార్లమెంట్‌ సమావేశాలు ఆఖరి రోజు రాజీనామా లు అందించారన్నారు. వైసీపీ, బీజేపీ చీకటి ఒప్పందం కుదుర్చుకు న్నాయన్నారు. ఎంపీల రాజీనామాలు ఆమోదించకపోవడమే దీనికి నిదర్శనమన్నారు. కర్ణాటకలో బీజేపీ ఎంపీలు రాజీనామాలు ఇచ్చిన వెంటనే ఆమోదించారని, పార్లమెంట్‌లో వైసీపీ ఎంపీలు రాజీనామాలు ఇచ్చి 40రోజులైనా ఆమోదించకపోవడం విడ్డూరమన్నారు. వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి సీఎంగా ఉండగా జగన్‌ లక్షల కోట్లు తినడంతో ప్రతీ శుక్రవారం కోర్టుకు వెళ్లాల్సి వస్తోందన్నారు. సీఎం చంద్రబాబుకు మద్దతు తెలిపితే అమరావతి, పోలవరం, విశాఖ రైల్వేజోన్‌లను పొందవచ్చన్నారు.

సమావేశంలో జొన్నలగడ్డ సుబ్బరాయ చౌదరి, హస్తకళల అభివృద్ధి కమిటీ చైర్మన్‌ పాలి ప్రసాద్‌, టీడీపీ రాష్ట్ర à°•à°¾ ర్యదర్శి రాయపాటి రంగబాబు, దాసరి ఆంజనేయులు, చలసాని సోమ్‌బాబు, జగదీష్‌ బాబు, ఏఎంసీ చైర్మన్‌ వేగి చిన్న, మునిసిపల్‌ చైర్‌పర్సన్‌ జొన్నలగడ్డ రాధారాణి, మాజీ చైర్మన్‌ సూరపనేని చిన్ని, వైస్‌ చైర్మన్‌ దుద్దుపూడి రాజా రమేష్‌, జడ్పీటీసీ గారపాటి శ్రీదేవి, మద్దిపట్ల శివరామకృష్ణ, కంఠమణి రామకృష్ణారావు, గారపాటి వెం కటకృష్ణ, జీవీఎస్‌ నారాయణ, ఆర్యవైశ్య సంఘం పట్టణాధ్యక్షుడు గ్రంథి వీరభద్ర స్వామి, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

మినీ మహానాడులో తీర్మానాలు

మినీ మహానాడులో పలు సమస్యలపై తీర్మానాలు చేశారు. కొవ్వూరు ప్రభుత్వ ఆస్పత్రిలో పూర్తి స్థాయి సిబ్బందితో పాటు మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయా లి, రైతులకు స్వామినాథన్‌ కమిషన్‌ అమలు చేయడంతో పాటు సాగు ఖర్చు లకు ఏడాదికి ఎకరాకు రూ.10 వేలు అందించాలి. పట్టణంలో ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఏర్పాటు చేయాలి. రైతులకు ఇనఫుడ్‌ సబ్సిడీ విడుదల చేయాలి. రుణ మాఫీ సొమ్ము విడుదల చేయాలి. ఎక్స్‌ ప్రెస్‌ రైళ్ల హాల్ట్‌ ఏర్పాటు చేయాలి. వచ్చే ఎన్నికల్లోలోపు కాపులను బీసీల్లో చేర్చేలా కేంద్రంతో చర్చలు జరపాలి. జిల్లా, రాష్ట్ర స్థాయి మినీ మహానాడులో చర్చించి తీర్మానాలు అమలయ్యేలా చర్యలు తీసుకోవాలని మంత్రి జవహర్‌, ఎంపీ మాగంటి మురళీమోహన్‌లను కోరారు.దీనితో పాటుతూర్పుగోదావరి జిల్లా రామచంద్రా పురం మాజీ మునిసిపల్‌ చైర్మన్‌ పంత à°—à°‚à°Ÿà°¿ జీవనజ్యోతి టీడీపీ తీర్థం పుచ్చు కున్నారు. కొవ్వూరులో సోమవారం జరి à°—à°¿à°¨ మినీ మహానాడులో ఎంపీ మురళీ మోహన్‌ జీవన్‌జ్యోతికి పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు. à°ˆ సందర్భంగా జీవన్‌జ్యోతి మాట్లాడుతూ టీడీపీ అధి నేత చంద్రబాబు అభివృద్ధి కాంక్షను చూసి పార్టీలో చేరుతున్నానని అన్నారు.