టీడీపీ అంటే...తెలుగు దొంగల పార్టీ

Published: Wednesday May 23, 2018

టీడీపీపై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి విమర్శలు గుప్పించారు. టీడీపీ ఎవరిపై ధర్మా పోరాటం చేస్తుందని ప్రశ్నించారు. చంద్రబాబు పోరాటం ప్రజల పైనా? అని నిలదీశారు. టీడీపీ అంటే తెలుగు దొంగల పార్టీ...తెలుగు డ్రామాల పార్టీ అని విజయసాయిరెడ్డి వ్యాఖ్యానించారు. ప్రజలను మభ్యపెట్టడానికే ధర్మ పోరాటం చేపట్టారని ఆరోపించారు. గతంలో వైసీపీ అడిగితే ఏయూ ఇంజినీరింగ్ గ్రౌండ్‌ ఇవ్వలేదని...ఇప్పుడు టిడిపికి ఎలా ఇచ్చారని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ప్రశ్నించారు