ఎన్నికల బరిలోకి లాలూ కోడలు

ఆర్జేడీ అధినేత, బిహార్ మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ యాదవ్ కోడలు ఐశ్వర్య రాయ్ రాజకీయాల్లోకి అడుగుపెట్టబోతున్నట్లు సమాచారం. 2019 లోక్ సభ ఎన్నికల్లో బిహార్‌లోని చాప్రా నియోజకవర్గం నుంచి పోటీ చేయనున్నట్లు తెలుస్తోంది. లాలూ కోడలు ఎన్నికల్లో పోటీ చేయాల్సిందిగా బిహార్ ప్రజలు ఆకాంక్షిస్తున్నట్లు ఆర్జేడీ నేత రాహుల్ తివారీ మీడియా ద్వారా వెల్లడించారు. అయితే ఐశ్వర్య విషయంలో తుది నిర్ణయం లాలూదేనని పేర్కొన్నారు.
మే12న లాలూ పెద్ద కుమారుడు తేజ్ ప్రతాప్‌కు బిహార్ మాజీ ముఖ్యమంత్రి డరోగా ప్రసాద్ రాయ్ మనవరాలు ఐశ్వర్య రాయ్‌కు వివాహం జరిగింది. దాంతో పార్టీకి సంబంధించిన పలు బాధ్యతలను ఐశ్వర్యకు కూడా కేటాయించాలని లాలూ కుటుంబం యోచిస్తోంది. మరోపక్క ఈ విషయమై విపక్ష పార్టీలు వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నాయి. ఎన్నికల్లో ఇతరులను పోటీ చేయనివ్వకుండా కేవలం తమ ఇంట్లోవారికే అవకాశాలు ఇస్తున్నారని విమర్శిస్తున్నారు.

Share this on your social network: