4 లోక్ సభ - 10 అసెంబ్లీ పోల్స్ : గెలుపెవరిది

Published: Monday May 28, 2018

మొన్ననే కర్ణాటకలో మట్టి à°•à°°à°¿à°šà°¿à°¨ బీజేపీకి ఇప్పుడు మరో పరీక్ష ఎదురైంది.. తాజాగా పలు రాష్ట్రాల్లో 4 లోక్ సభ స్థానాలకు - 10 అసెంబ్లీ స్థానాలకు నేడు ఉప ఎన్నికలు జరుగుతున్నాయి. ప్రధానంగా ఉత్తరప్రదేశ్ లోని కైరానా లోక్ సభ స్థానంపైనే అందరి దృష్టి నెలకొంది. ఇటీవల యూపీ సీఎం ప్రాతినిధ్యం వహించిన గోరఖ్ పూర్ - అలాగే మరో స్థానం ఫల్పూర్ నియోజకవర్గాల్లో బీజేపీ ఘోర పరాజయం పాలైన నేపథ్యంలో యూపీ ఎన్నికల్లో ఎవరు గెలుస్తారనే విషయంపైనే దేశవ్యాప్తంగా ఆసక్తి నెలకొంది.à°—à°¡à°¿à°šà°¿à°¨ ఎన్నికల్లో ఎస్పీ-బీఎస్పీ కలిసి పోటీచేసి బీజేపీని మట్టికరిపించాయి.  ఈసారి కూడా అవే ఫలితాలు పునరావృతం అవుతాయా.? లేక బీజేపీ సత్తా చాటుతుందా అని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. 

ఇక యూపీతో పాటు మహారాష్ట్రలోని పాల్గర్ - భండారా-గోండియా లోక్ సభ స్థానాలకు కూడా నేడు ఎన్నికలు జరగనున్నాయి. నాగాలాండ్ లోని సాలె ఎంపీ స్థానానికి కూడా నేడు ఉప ఎన్నిక జరగనుంది. 

ఇక అసెంబ్లీ స్థానాల విషయానికి వస్తే.. గోమియా - సిల్లి (జార్ఖండ్) - చెంగన్నూర్ (కేరళ) - పాలస్ కడేగాన్ (మహారాష్ట్ర) - అవంతి (మేఘాలయ) - తరలి(ఉత్తరాఖండ్) - మహేస్తల (పశ్చిమ బెంగాల్) - నూర్పూర్ (ఉత్తరప్రదేశ్) - షాకోట్ (పంజాబ్) - జోకిహట్ (బీహార్) లకు ఉప ఎన్నికలు జరగనున్నాయి