మోదీ పాలనపై కేజ్రీవాల్

Published: Tuesday May 29, 2018


ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వంపై ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ తనదైన శైలిలో విరుచుకుపడ్డారు. ట్విటర్లో à°“ కార్టూన్ పోస్టు చేస్తూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. కేజ్రీవాల్ సారథ్యంలోని ఆమాద్మీ పార్టీ ప్రభుత్వం విద్య, ఆరోగ్యం సహా పలు విభాగాల్లో ప్రగతి పథంలో దూసుకెళ్తుండగా... బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం ఇప్పటికీ ఒక్కదాంట్లో కూడా సరైన ఫలితం చూపించలేదని సదరు కార్టూన్‌లో చూపించారు.
 
మొహల్లా క్లినిక్, తక్కువ ధరకే విద్యుత్, ఉచిత నీటిసరఫరా, ఉచిత వైద్యం, ఆధునాతన ప్రభుత్వ పాఠశాలలు తదితర అంశాల్లో తాము సాధించిన విజయాలను à°“ ఆకాశ హార్మ్యంలాగా కేజ్రీవాల్ చూపించారు. దాని పక్కనే బీడుబారిన à°“ స్థలంలో సరిహద్దులు కట్టినట్టు... పునాదుల మధ్యలో à°“ బోర్డు పెట్టినట్టు చూపించారు. కమలం గుర్తు ఉన్న à°† బోర్డుపై ‘‘నిర్మాణ పనులు జరుగుతున్నాయి..’’ అని రాసి ఉంది. దేశ రాజధానిలో ఆమాద్మీ పార్టీ ప్రభుత్వం సాధించిన విజయాలు ఆకాశ హార్మ్యాలను తాకుతుంటే... మోదీ ప్రభుత్వం ఇంకా పునాదుల వద్దే విఫలమైన స్థితిలో ఉందని కేజ్రీవాల్ ఎద్దేవా చేశారు. ఢిల్లీ, హర్యానా మధ్య నీటి పంపకాల విషయంలో జోక్యం చేసుకోవాలంటూ ప్రధాని మోదీకి లేఖ రాసిన కేజ్రీవాల్... రెండు వారాలు గడవక ముందే మళ్లీ విమర్శల దాడికి దిగడం గమనార్హం.