ప్రధానిపై వ్యాఖ్యలకు సుష్మా క్షమాపణలు.

Published: Tuesday May 29, 2018


ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేపాల్ పర్యటనపై తాను చేసిన వ్యాఖ్యల్లో తప్పు దొర్లిందంటూ కేంద్ర విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ అంగీకరించారు. నేపాల్‌లోని జానక్‌పూర్‌లో ప్రధాని మోదీ లక్షలాది మంది ‘‘భారతీయులను’’ ఉద్దేశించి ప్రసంగించారంటూ ఆమె పేర్కొనడంపై ట్విటర్లో దుమారం రేగింది. à°ˆ నెల మొదట్లో జానక్‌పూర్‌లో మోదీ మాట్లాడింది నేపాలీలతోనేననీ.. భారతీయులతో కాదని నేపాల్‌à°•à°¿ చెందిన à°“ పార్లమెంటు సభ్యుడు సైతం విమర్శించారు. దీంతో సోమవారం రాత్రి సుష్మా స్వరాజ్ ట్విటర్లో స్పందిస్తూ..
 
‘‘à°ˆ పొరపాటు నా వల్లే జరిగింది. అందుకు నేను మనస్పూర్తిగా క్షమాపణ కోరుతున్నాను...’’ అని పేర్కొన్నారు. మోదీ గురించి తాను మాట్లాడిన వీడియో సైతం ఆమె పోస్టు చేశారు.  నేపాల్‌తో సహా విదేశాల్లోని భారతీయులందరికీ చేరువయ్యేందుకు మోదీ విశేష కృషి చేస్తున్నారంటూ ఆమె వ్యాఖ్యానించారు. మోదీ నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వానికి నాలుగేళ్లు నిండిన సందర్భంగా సుష్మ ఇటీవల à°“ మీడియా సమావేశంలో మాట్లాడుతూ... ‘‘అమెరికాలోని మాడిసన్ స్క్వేర్ మొదలు నేపాల్‌లోని జానక్‌పూర్ వరకు లక్షలాది మంది భారతీయులను కలుసుకుని మాట్లాడిన తొలి ప్రధాని మోదీ...’’ అని ఆమె పేర్కొన్నారు. అయితే ఆమె వ్యాఖ్యలపై నేపాల్ కాంగ్రెస్ నేత, పార్లమెంటు సభ్యుడు గగన్ తాప అభ్యంతరం వ్యక్తం చేశారు. ‘‘నేపాల్ సార్వభౌమత్వాన్ని చాలా సాధారణంగా తీసిపారేస్తున్నట్టు అనిపిస్తోంది..’’ అంటూ సుష్మా స్వరాజ్‌పై  ట్విటర్లో విమర్శలకు దిగారు