సీబీఐ దాడి... మోదీని గట్టిగా నిలదీసిన సీఎం..

Published: Wednesday May 30, 2018
ఢిల్లీ రాష్ట్ర ప్రజా పనుల శాఖ (పీడబ్ల్యూడీ) మంత్రి సత్యేంద్ర జైన్ నివాసంలో బుధవారం కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) సోదాలు చేసింది. పీడబ్ల్యూడీ కోసం క్రియేటివ్ టీమ్‌ను నియమించినందుకు à°ˆ సోదాలు జరిగాయి.
 
24 మందితో క్రియేటివ్ టీమ్‌ను పీడబ్ల్యూడీ కోసం ఏర్పాటు చేసేందుకు జైన్ తీసుకున్న నిర్ణయం à°—à°¤ ఏడాది సీబీఐ దృష్టికి వచ్చింది. డిటెక్టివ్ ఏజెన్సీ ద్వారా వీరిని నియమించుకోవాలని జైన్ నిర్ణయించారు. వీరి చేత వీథి క్లినిక్‌లు, ఇతర పీడబ్ల్యూడీ ప్రాజెక్టుల్లో పని చేయించాలని జైన్ భావించారు. వీరికి కాంట్రాక్టు దక్కే విధంగా టెండరు డాక్యుమెంట్లలో సర్దుబాట్లు చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి.
 
బుధవారం సీబీఐ దాడులపై సత్యేంద్ర జైన్ à°“ ట్వీట్ చేశారు. పీడబ్ల్యూడీ క్రియేటివ్ టీమ్‌ను నియమించుకున్నందుకు సీబీఐ తన నివాసంపై దాడి చేసిందని పేర్కొన్నారు. వివిధ ప్రాజెక్టుల కోసం ప్రొఫెషనల్స్‌ను నియమించుకున్నట్లు తెలిపారు. అందరినీ బయటికి వెళ్ళిపోవాలని సీబీఐ డిమాండ్ చేసిందన్నారు.
 
ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ à°ˆ పరిణామాలపై స్పందిస్తూ ఇచ్చిన ట్వీట్‌లో ప్రధాన మంత్రి మోదీ ఏం కోరుకుంటున్నారని ప్రశ్నించారు.