విజయనగరంలో పర్యటించనున్న...జనసేన అధినేత పవన్ కళ్యాణ్

Published: Thursday May 31, 2018

విజయనగరం:నేడు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ జిల్లాలో పర్యటించనున్నారు. కురుపాం, పార్వీతీపురం, బొబ్బిలి నియోజకవర్గాల్లో ఆయన పర్యటన జరుగుతుంది. ప్రజాపోరాట యాత్రలో భాగంగా విజయనగరం జిల్లాలో అడుగుపెట్టిన జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ బుధవారం పార్టీ వర్గాలతో చర్చలకే పరిమితమయ్యారు.

అయితే పవన్ బస చేసిన బొబ్బిలిలోని సూర్య రెసిడెన్సీ వద్దకు అభిమానులు ఉదయం నుంచే భారీగా తరలివచ్చి ఆయన్ను చూసేందుకు à°—à°‚à°Ÿà°² తరబడి ఎండలో నిరీక్షించారు. దీంతో పవన్‌ గేటు బయటకు వచ్చి వారిని పలకరించే ప్రయత్నం చేయగా అభిమానులు ఒక్కసారిగా ముందుకు తోసుకురావడంతో ఆయన వ్యక్తిగత సిబ్బంది వారిని నియంత్రించేందుకు విఫలయత్నం చేశారు. పరిస్థితి గందరగోళంగా మారడంతో పవన్ పక్కనే ఉన్న ఓపెన్‌టాప్‌ వాహనంపైకి వెళ్లి అక్కడి నుంచి అభిమానులకు అభివాదం చేసి వెళ్లిపోయారు.

విజయనగరం జిల్లాలో అడుగుపెట్టిన తొలిరోజు మొత్తం కోర్‌కమిటీ సభ్యులతో చర్చలకే పవన్ సమయం కేటాయించారు. పార్వతీపురం డివిజన్‌లోని నియోజకవర్గాల పరిస్థితులపై చర్చించారు. స్థానిక సమస్యలు, ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులపై సభ్యులను వివరాలు à°…à°¡à°¿à°—à°¿ తెలుసుకున్నారు. తన పర్యటనలో ఆయన వీటిని ప్రస్తావించేందుకే ఆరా తీసినట్లు తెలుస్తోంది. అనంతరం ఆయన కొద్ది మంది అభిమానులతో కూడా భేటీ అయినట్లు సమాచారం.