పవన్‌ చెబితే ఏదైనా చేస్తా

Published: Saturday June 02, 2018

మావయ్య పవన్‌ కల్యాణ్‌ చెబితే తాను ఏదైనా చేస్తానని, అందులో సందేహం అక్కర్లేదని ప్రముఖ హీరో సాయిధరమ్‌తేజ్‌ అన్నారు. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో ఓ ప్రైవేటు కార్యక్రమంలో పాల్గొనేందుకు ఆయన హీరోయిన్‌ కేథరిన్‌తో కలిసి శుక్రవారం ఇక్కడకు వచ్చారు. ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడుతూ.. పవన్‌ కల్యాణ్‌ ఆదేశిస్తే జనసేన తరఫున ఎన్నికల ప్రచారంలో పాల్గొనేందుకు సిద్ధమేనని తన ఉద్దేశాన్ని తెలియజేశారు. తాను నటించిన ‘తేజ్‌.. ఐ లవ్‌ యు’ సినిమా ఈ నెల 29న విడుదలవుతుందని, మరో సినిమా షూటింగ్‌ దశలో ఉందని సాయిధరమ్‌ చెప్పారు. గోదావరి తీరం రాజమహేంద్రవరం అంటే తనకు ఇష్టమని, ఇక్కడకు రావడం ఆనందంగా ఉందని హీరోయిన్‌ కేథరిన్‌ అన్నారు