యడ్యూరప్పకు క్లాస్ పీకిన అమిత్‌షా

Published: Tuesday June 05, 2018

కర్ణాటకలో సంకీర్ణ పాలనలో భిన్నాభిప్రాయాలు తలెత్తుతాయని ఎమ్మెల్యేలలో అసంతృప్తి నెలకొని రోడ్డెక్కే పరిస్థితి సుదూరంలో లేదని అంతవరకు బీజేపీ రాష్ట్ర నాయకులు ఎవరూ జోక్యం చేసుకోరాదని à°† పార్టీ అధిష్ఠానం సూచించింది. పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌à°·à°¾ రాష్ట్ర అధ్యక్షుడు, ప్రతిపక్షనేత యడ్యూరప్పకు సూచించినట్లు తెలిసింది. రాష్ట్రంలో బీజేపీకి ప్రజలు ఆశీర్వదించి 104 మంది ఎమ్మెల్యేలను గెలిపించారని కాంగ్రె్‌సకు 79, జేడీఎ్‌సకు 37 మంది మాత్రమే ఎమ్మెల్యేలు ఉన్నారని ఇది ప్రజలు నిర్ణయించిన తీర్పుగా భావించాలన్నారు. ఎన్నికల ముందు వరకు సవాళ్ళు, విమర్శలు చేసుకున్న కాంగ్రెస్‌, జేడీఎస్‌లు అధికారం కోసం ఒక్కటైన రోజునుంచే విభేధాలు గమనించాలన్నారు.

గవర్నర్‌ ప్రమాణస్వీకారానికి సూచించినా మూడు రోజులు జాప్యం చేశారని à°† తర్వాత మంత్రివర్గ విస్తరణకు ఏకంగా 12 రోజులు గడువు తీసుకోవాల్సి వచ్చిందని, అంతకంటే సీనియర్లకు మంత్రి పదవి లేదనేది పెను దుమారం కానుందని నోరు జారి విమర్శలకు పోవాల్సిన పనిలేదని సూచించినట్లు తెలిసింది. సంకీర్ణంలో విభేధాలు వస్తే రెండు పార్టీలు బీజేపీపై సాకు చూపి రాజకీయం చేసే పరిణామాలు ఉన్నాయని హెచ్చరించినట్లు తెలిసింది. 2019 లోకసభ ఎన్నికలే మనకు టార్గెట్‌ కావాలని సున్నితంగా మందలించినట్లు సమాచారం. యడ్యూరప్పతోపాటు పార్టీ వ్యవహారాల ఇన్‌చార్జ్‌ మురళీధరరావు, కేంద్రమంత్రులు అనంతకుమార్‌, సదానందగౌడలకు ఇదే అభిప్రాయాలు అమిత్‌à°·à°¾ సూచించినట్లు సమాచారం. నిత్యం కార్యకర్తల మధ్యనే ఉండాలని ఇప్పటినుంచే పార్టీ బలోపేతానికి కృషి చేయాలని సూచించారు. ఇదిలా ఉండగా ప్రధాని నరేంద్రమోదీ నాలుగేళ్ళ పాలనపై విస్తృతంగా ప్రచారం చేసేందుకు 9 కమిటీలు వేసుకుని జిల్లాలవారీగా సమీక్షలు మీడియాగోష్టులు నిర్వహించాలని, నియోజకవర్గాల వ్యాప్తంగా ముఖ్యనేతల పర్యటనలు ఉండాలని సూచించినట్లు సమాచారం.