సీఎంను చంపేస్తా..సీఎం బంధువులను రేప్ చేస్తా..ఎన్నారై హెచ్చరిక

Published: Thursday June 07, 2018

రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్‌ఎస్‌ఎస్) మద్ధతుదారుగా చెప్పుకున్న ఎన్నారై కృష్ణకుమార్ ఎస్ఎన్ నాయర్ సీఎంను హెచ్చరిస్తూ వీడియోను సోషల్ మీడియాలో పోస్టు చేశారు. దుబాయ్ అబుదాబీకి చెందిన నిర్మాణ రంగ సంస్థలో పనిచేస్తున్న కృష్ణకుమార్ ఎస్ఎన్ నాయర్ తన ఉద్యోగం కోల్పోయినట్లయితే కేరళ వచ్చి తన పాత తుపాకీ దుమ్ము దులిపి సీఎం పినవాయి విజయన్ ను చంపేసి , ఆయన బంధువులను రేప్ చేస్తానని వీడియోలో హెచ్చరించాడు. తన జీవితం ఏమైనా పరవాలేదని తన ఉద్యోగం పోయాక సీఎంను చంపాలని నిర్ణయించుకున్నానని కృష్ణకుమార్ వీడియోలో పేర్కొన్నాడు. కృష్ణకుమార్ హెచ్చరిక వీడియోను సీపీఐ(ఎం) న్యూస్ చానల్ కరియాలీ ప్రముఖంగా ప్రసారం చేసింది. దీంతో మళ్లీ నాయర్ సీఎం విజయన్ కు క్షమాపణలు చెబుతూ తాను మైకంలో అలా అన్నానని మరో వీడియోను పోస్టు చేశారు. కాగా యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ చట్టాల ప్రకారం సైబర్ నేరంగా పరిగణించి అతనికి జైలు శిక్ష కాని జరిమానా కాని విధించే అవకాశం ఉంది. కంపెనీ నిబంధనలకు విరుద్దంగా వీడియో హెచ్చరిక చేసిన ఉద్యోగి నాయర్ పై చర్యలు తీసుకుంటామని కంపెనీ హెచ్ ఆర్ కన్సల్ టెంట్ చెప్పారు.