మోదీని ఎదిరించిన సీఎంను

Published: Friday June 08, 2018


‘ప్రధాని నరేంద్ర మోదీని ఎదిరించిన మొదటి ముఖ్యమంత్రిని నేనే. గోద్రా అల్లర్ల సమయంలో, ఇటీవల ట్రిపుల్‌ తలాక్‌ విషయంలోని కొన్ని అంశాలపై ఆయన్ను వ్యతిరేకించా. నాపై వ్యక్తిగత కక్ష పెంచుకున్న ఆయన రాష్ట్ర అభివృద్ధికి సహకరించడం లేదు. నిధులు ఇస్తే మనమెక్కడ బలపడి భవిష్యత్‌లో ఆయనకు అడ్డు వస్తామేమోనన్న భయం పట్టుకుంది. అందుకే ప్రత్యేక హోదాపై మాటతప్పారు. ఆవిర్భావం నుంచీ టీడీపీ మైనారిటీల పక్షపాతిగానే ఉంది. 2014లో రాష్ట్రాభివృద్ధిని కాంక్షించి కొంత మంది మైనారిటీ సోదరులు నొచ్చుకున్నా బీజేపీతో పొత్తుపెట్టుకోవాల్సి వచ్చింది’ అంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం తరపున చిత్తూరు జిల్లా మదనపల్లెలో గురువారం సాయంత్రం ముస్లిం మైనారిటీ సోదరులకు ఇఫ్తార్‌విందు ఏర్పాటు చేశారు. à°ˆ సందర్భంగా సీఎం మాట్లాడుతూ తన అంతరంగాన్ని ఆవిష్కరించారు. ‘2014 అసెంబ్లీ ఎన్నికల కంటే ముందు జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో మైనారిటీలు టీడీపీని ఆదరించారు.
 
బీజేపీతో పొత్తు కారణంగా అసెంబ్లీ ఎన్నికల్లో పాక్షికంగా నిరాదరించారు’ అని చెప్పారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం తాము అన్నింటికీ సిద్ధపడి కేంద్రంతో పోరాటం చేస్తుంటే.. వైసీపీ మాత్రం బీజేపీతో లోపాయకారీ ఒప్పందాలతో రాష్ట్ర ప్రయోజనాలకు తూట్లు పొడుస్తోందని ధ్వజమెత్తారు. రాష్ట్రపతి, ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో బీజేపీ నాయకులు అడగకపోయినా వైసీపీ నాయకులు మద్దతు తెలిపారని విమర్శించారు. కాగా, విందుకు ముందు జామియా మసీదులో ముస్లిం మత పెద్దలతో కలిసి ప్రార్థనల్లో పాల్గొన్నారు.