ఇదేనా పాలన?: చంద్రబాబు

Published: Thursday April 15, 2021

వైసీపీ ప్రభుత్వంపై టీడీపీ జాతీయ అధ్యక్షులు చంద్రబాబు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. సీఎం జగన్ మొద్దు నిద్రపోతున్నారని విమర్శించారు. జగన్‌కు కళ్లు నెత్తికెక్కాయని.. మదమా.. కొవ్వా అర్థం కావడం లేదన్నారు. ‘అసలు మనుషులేనా... ఇదేనా పాలన?’ అని ప్రశ్నించారు. ఫీరీయింబర్స్‌మెంట్ సకాలంలో ఇవ్వడంలేదని, చాలా దుర్మార్గంగా వ్యవహరిస్తున్నారనన్నారు. 

 

తిరుపతిలో మీడియా సమావేశంలో గురువారం మాట్లాడిన ఆయన.. ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేని పరిస్థితి నెలకొంది. à°ˆ నెల ఇస్తే... వచ్చే నెల ఏమవుతుందోనన్న ఆందోళన నెలకొంది. కుక్కలు చింపిన విస్తరిలా పాలన మారింది. ఎక్కడికక్కడ అప్పులు చేస్తున్నారు. ఉద్యోగులకు టీఏ, డీఏ ఇవ్వడం లేదు. సీపీఎస్ అతీగతీ లేదు. పీఆర్సీ కమిటీ వరకే ఆగిపోయింది. పాలనానుభవం లేకపోవడంతో... కళ్లు నెత్తికెక్కి మాట్లాడుతున్నాడు. ఎవరూ ఏమీ చేయలేరనే ధీమాతో సీఎం ఉన్నాడు. చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా 164 ఆలయాలపై దాడులు జరిగితే... ఇప్పటి వరకు కనిపెట్టలేకపోయారు. ఎప్పుడూ జరగనిది.. à°ˆ రెండేళ్ల పాలనలో జరిగాయి. రామతీర్థంలో నాపై కేసులు పెట్టారు. హక్కుగా, బాధ్యతగా వెళితే... నాపై తప్పుడు కేసులు పెట్టారు. తిరుపతిలో రాళ్లు వేస్తారు. నన్నే సాక్ష్యం ఇమ్మంటున్నారు. దొంగతనం జరిగితే మనమే దొంగల్ని పట్టుకోవాలా... మీడియా సమక్షంలోనే జరిగింది. నాసిరకం మద్యంతో జనం అనారోగ్యం పాలవుతున్నారు. à°ˆ సీఎం ఆనందిస్తున్నాడు తప్ప... తప్పును సరి చేసుకోవడం లేదు’’ అని ఘాటైన వ్యాఖ్యలు చేశారు.