జగన్ పాదయాత్రకు మరోదారి .......

వైసీపీ అధినేత జగన్ ప్రజా సంకల్ప పాదయాత్రను రోడ్ కం రైల్ బ్రిడ్జి మీదుగా కాకుండా మరో మార్గంలో నిర్వహించుకోవాలని తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం అర్బన్ జిల్లా సౌత్‌జోన్ డీఎస్పీ భరత్‌మాతాజీ వైసీపీ నేతలకు నోటీసు ఇచ్చారు. ఈ నెల 12వ తేదీన తూర్పు గోదావరి జిల్లాలోకి అడుగుపెట్టనున్నారు. ఈ నేపథ్యంలో ఎక్కువ మంది పాదయాత్ర చేసేందుకు బ్రిడ్జి కండిషన్ బాగోలేదని, మరో మార్గం చూసుకోవాలని సూచించారు. జగన్ పాదయాత్ర కోసం, నగరంలో కోటిపల్లి బస్టాండు వద్ద సభ కోసం అనుమతి ఇవ్వాల్సిందిగా అర్బన్ జిల్లా పోలీసులకు వైసీపీ నగర కో-ఆర్డినేటర్ రౌతు సూర్యప్రకాశరావు లేఖ రాశారు. దీనికి స్పందించిన డీఎస్పీ రోడ్ కం రైలు బ్రిడ్జి 50 ఏళ్ల క్రితం నాటిదని, దాని పారా పెట్రోల్ వాల్స్ కండిషన్ సరిగాలేదని, కొన్ని జాగ్రత్తలు తీసుకుని పాదయాత్ర చేసుకోవాలని, సాధ్యమైనంత వరకు ప్రత్యామ్నాయంగా వేరే మార్గం చూసుకోవాలని ఆ నోటీసులో పేర్కొన్నారు.

Share this on your social network: