వైసీపీ నుంచి టీడీపీలోకి 20 కుటుంబాలు

Published: Tuesday June 12, 2018

చెన్నేకొత్తపల్లి మండలం ముష్టికోవెల పంచా యతీ గువ్వల గొందిపల్లికి చెందిన వైసీపీ నాయకులు, కార్యకర్తలు యువనేత పరిటాల శ్రీరామ్‌ ఆధ్వర్యంలో సోమవారం టీడీపీలోకి చేరారు. వెంకటాపురంలో జరిగిన à°“ కార్యక్రమంలో వైసీపీకి చెందిన 20 కుటుంబాల వారికి టీడీపీ పార్టీ కండువా కప్పి శ్రీరామ్‌ టీడీపీ లోకి ఆహ్వానించారు. జి.లింగమయ్య, కత్తిసాయి, శ్రీరాములు, పోతన్న తదితరుల ఆధ్వర్యంలో టీడీపీలోకి చేరారు. మంత్రి పరిటాల సునీత నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసిందంటూ వారు పేర్కొన్నారు. ఈకార్యక్రమంలో స్థానిక టీడీపీ నేతలు పాల్గొన్నారు.