జగన్ పాదయాత్ర.............. కంపించిన రోడ్డు కమ్ రైలు బ్రిడ్జి

Published: Wednesday June 13, 2018

పశ్చిమ గోదావరి జిల్లాలో వైసీపీ అధినేత జగన్‌ చేపట్టిన ప్రజా సంకల్ప యాత్ర మంగళవారం ముగిసింది. జగన్‌కు వీడ్కోలు పలకడానికి నాయకులు, కార్యకర్తలు వేలాది సంఖ్యలో చేరుకోవడంతో కొవ్వూరులోని రోడ్డు కమ్‌ రైలు బ్రిడ్జి à°’à°• దశలో కంపించింది. ఇది గమనించిన పోలీసులు కొంత వ్యవధిని పాటించి కార్యకర్తలను పాదయాత్రకు అనుమతించారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు లేకుండా పాదయాత్ర రాజమండ్రి చేరుకుంది. పాదయాత్రలో బొత్స సత్యనారాయణ, జీఎస్‌రావు, వైవీ సుబ్బారెడ్డి, కొవ్వూరు నియోజకవర్గ కన్వీనర్‌ తానేటి వనిత, పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి, జీఎస్‌ నాయుడు, కారుమూరి నాగేశ్వర రావు, గుణ్ణం నాగ బాబు, కోటగిరి శ్రీధర్‌ తదితరులు పార్టీ అధినేత వెంట పాల్గొన్నారు.