బీజేపీతో జగన్‌ స్నేహం.....

Published: Sunday June 17, 2018

ప్రతిపక్షనేత వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి బీజేపీతో తెరవెనుక స్నేహం చేయడం వల్ల రాష్ట్రం నష్టపోయిందని, రాష్ట్ర ప్రయోజనాల కోసం కేం ద్రంపై పోరాటంలో ప్రతిపక్షం పూర్తిగా విఫలమయింద ని పీసీసీ చీఫ్‌ ఎన్‌.రఘువీరారెడ్డి అన్నారు. శనివారం అనంతపురంలో ఆయన మాట్లాడుతూ, ప్రతిపక్ష పార్టీ బీజేపీ ఇంట్లో ఇల్లాలుగా ఉండేందుకు ప్రయత్నిస్తుంటే, అధికార పార్టీ టీడీపీ బీజేపీతో ప్రియురాలిగా ఉండేందుకు ప్రయత్నిస్తోందని ఎద్దేవా చేశారు. నీతి ఆయోగ్‌కు పోలవరం ప్రాజెక్టు నిర్మాణం పనుల నిధుల విషయంలో కేంద్రాన్ని నిలదీస్తామంటూ చంద్రబాబు లేఖ రాయడాన్ని ఆయన తప్పుబట్టారు.