మీ ఎమ్మెల్యే పని తీరు ఎలా ఉంది....

ప్రజలకూ, ప్రభుత్వానికీ వారధి... ఆ నియోజకవర్గ శాసనసభ్యుడే! ఎమ్మెల్యే స్థానికంగా అందుబాటులో ఉండటం, ప్రజా సమస్యలపై స్పందించడం, వాటిని ప్రభుత్వ దృష్టికి తీసుకురావడం, అభివృద్ధి-సంక్షేమ కార్యక్రమాలను సక్రమంగా అమలు చేయడం ఇవే ఎమ్మెల్యేలు చేయాల్సిన పనులు! ఎమ్మెల్యే పనితీరుకు ఇవే గీటురాళ్లు! నాలుగేళ్లుగా నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న శాసనసభ్యుల పని తీరుపై ఇప్పుడు ప్రజలు ఏమనుకుంటున్నారన్నది కీలకం! లగడపాటి రాజగోపాల్ తరఫున సర్వేలు నిర్వహించే ఆర్జీస్ ఫ్లాష్ టీమ్ ‘ఆంధ్రజ్యోతి’కోసం చేసిన సర్వేలో ఈ ప్రశ్న కూడా ఒకటి! ‘మీ నియోజకవర్గ శాసనసభ్యుడి పని తీరుపై మీ అభిప్రాయం ఏమిటి?’ అని ప్రశ్నించగా... అధికార పార్టీ ఎమ్మెల్యేల విషయంలో ఎక్కువ శాతం సంతృప్తే వ్యక్తమైంది. కారణం ఏదైనప్పటికీ... విపక్ష వైసీపీ ఎమ్మెల్యేలపై మాత్రం అసంతృప్తిపాలు అధికంగా కనిపించింది. మొత్తానికి వ్యతిరేకత వ్యక్తమైన ఎమ్మెల్యేలలో మూడు పార్టీల వారూ ఉండటం గమనార్హం.

Share this on your social network: