సీఎం చంద్రబాబుతో చేనేత సంఘాల నేతలు

Published: Wednesday June 20, 2018

ముఖ్యమంత్రి చంద్రబాబుతో చేనేత సంఘాల నాయకులు బుధవారం ఉదయం భేటీ అయ్యారు. హిందూపురం ఎంపీ నిమ్మల కిష్టప్ప నేతృత్వంలో రాష్ట్ర చేనేత విభాగం ప్రెసిడెంట్, వనపల్లి రవికుమార్, సెక్రెటరీ నాగేశ్వరరావుతో పాటు సుమారు 100 మంది సీఎం నివాసానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా చేనేత కార్పొరేషన్ ఏర్పాటు చేయాలంటూ సీఎం చంద్రబాబుకు నేతలు విజ్ఞప్తి చేశారు.