గంటా శ్రీనివాసరావు ఎట్టకేలకు అలక వీడారు

Published: Friday June 22, 2018


మూడు రోజులుగా ముభావంగా ఉంటున్న మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి à°—à°‚à°Ÿà°¾ శ్రీనివాసరావు ఎట్టకేలకు అలక వీడారు. ఉపముఖ్యమంత్రి, విశాఖ జిల్లా ఇన్‌చార్జి మంత్రి నిమ్మకాయల చినరాజప్ప మంత్రాంగం ఫలించింది. గురువారం చినరాజప్ప విశాఖ వచ్చిన వెంటనే యలమంచిలి ఎమ్మెల్యే, పార్టీ రూరల్‌ అధ్యక్షుడు పంచకర్ల రమేశ్‌బాబుతో కలిసి నేరుగా à°—à°‚à°Ÿà°¾ నివాసానికి వెళ్లారు. ఇద్దరూ కాసేపు ఏకాంతంగా మాట్లాడుకున్నారు. తర్వాత ముఖ్యమంత్రి చంద్రబాబు గంటాకు ఫోనుచేసి సుమారు à°…à°°à°—à°‚à°Ÿ మాట్లాడారు.
 

à°—à°‚à°Ÿà°¾ ఎందుకు à°…à°‚à°¤ మనస్తాపం చెం దారని చినరాజప్ప à°ˆ సందర్భంగా ఆరా తీశారు. పక్కనే ఉన్న ఆయన సన్నిహితుడు బొడ్టేటి కాశీనాథ్‌ స్పందించి.. ‘ఆంధ్రజ్యోతి’ ప్రచురించిన సర్వేను ప్రస్తావించారు. జిల్లా లో ఇద్దరు మంత్రులు ఉన్నప్పుడు సర్వేకు గంటానే ఎందుకు ఎంచుకున్నారో అర్థం కావడం లేదన్నారు. ఇద్దరిపైనా సర్వే చేస్తే బాగుండేదని, ఒక్కరిపైనే రాయడంతో కావాలనే టార్గెట్‌ చేశారని à°—à°‚à°Ÿà°¾ మనస్తాపం చెందారని తెలిపారు. భీమిలి నియోజకవర్గంలో మంత్రిపై వ్యతిరేకత లేనేలేదని, ఇప్పటికిప్పుడు ఎన్నిక నిర్వహించినా ఆయనే గెలుస్తారని స్పష్టం చేశారు. అదే విషయం ముఖ్యమంత్రికి చెబుతామని, వచ్చే ఎన్నికల్లో ఆయనే భీమిలి నుంచే పోటీ చేస్తారని, 70 శాతం ఓట్లు సాధిస్తారని ధీమా వ్యక్తంచేశారు. గంటాను టీడీపీకి దూరం చేయాలని పార్టీలోని à°“ వర్గం కుట్ర చేస్తోందని ఆరోపించారు. మంత్రి తన సొంత ఇంటిని తనఖా పెట్టి బ్యాంకులో రుణం తీసుకుంటే.. ప్రభుత్వ భూములు తనఖా పెట్టి రుణం పొందారంటూ హైకోర్టులో రిట్‌ వేయించారని.. దీని వెనుక à°† వర్గం హస్తం ఉందని ఆరోపించారు. à°ˆ విషయాన్ని అప్పుడే ముఖ్యమంత్రి దృష్టికి à°—à°‚à°Ÿà°¾ తీసుకెళ్లారని తెలిపారు.