వర్షంతో పాదయాత్ర ఆలస్యం....
Published: Sunday June 24, 2018

వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ పాదయాత్ర శనివారం ఆలస్యంగా మొదలైంది. తూర్పుగోదావరి జిల్లా రాజోలు మండలంలోని చింతలపల్లిలో ఉదయం యాత్ర ప్రారంభం కావలసి ఉండగా.. వర్షం కారణంగా మధ్యాహ్నం మొదలుపెట్టారు. ఈ సందర్భంగా జడ్పీ మాజీ చైర్మన్ చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ ఆధ్వర్యంలో ఒలింపిక్ రన్ క్రీడాజ్యోతిని జగన్ వెలిగించి, ఒలింపిక్ రన్‌ను ప్రారంభించారు. మధ్యాహ్నం 2.45 గంటలకు చింతలపల్లి నుంచి ప్రారంభమైన పాదయాత్ర కూనవరం మీదుగా సాయంత్రం ములికిపల్లి సెంటర్‌కు చేరుకుంది. అక్కడే జగన్ బస చేశారు.

Share this on your social network: