ప్రజల తీర్పు ఐదేళ్లకు

Published: Wednesday June 27, 2018

ఐదేళ్లు పాలించాలని ప్రజలు తమకు తీర్పు ఇచ్చారని.. ముందస్తు ఎన్నికలకు వెళ్లాల్సిన అవసరం లేదని మంత్రి నారా లోకేశ్‌ తేల్చిచెప్పారు. ఈసారి ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీచేస్తానని వెల్లడించారు. సీఎం చంద్రబాబు ఎక్కడ పోటీ చేయాలని ఆదేశిస్తే అక్కడి నుంచి చేస్తానన్నారు. సోషల్‌ మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తే జైలు తప్పదని, ఈ విషయంలో సైబర్‌ చట్టం ప్రకారం వ్యవహరిస్తామన్నా రు. వచ్చే మంత్రివర్గ సమావేశంలో నిరుద్యోగ భృతిపై తుది రూపం తీసుకొస్తామన్నారు. త్వరలోనే దీనికి సంబంధించిన విధి విధానాలు కూడా ప్రకటిస్తామని తెలిపారు.