కుట్రదారులకు గుణపాఠం చెబుదాం...... బాలకృష్ణ

Published: Saturday June 30, 2018

లుగుజాతి ఉనికిని ప్రపంచానికి తెలియజేసిన తెలుగుదేశం పార్టీ తెలుగు ప్రజలకు à°“ వరం అని, అలాంటి పార్టీని కాపాడుకొని మళ్లీ పట్టం కట్టాలని సినీనటుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ అన్నారు. అనంతపురం జిల్లా చిలమత్తూరులో పల్లెబాట ముగింపు సభలో ఆయన మాట్లాడారు. ఎన్టీఆర్‌ ఆశయాలకు అనుగుణంగా సీఎం చంద్రబాబు వాటికి మరింత మెరుగులు దిద్ది ప్రజలకు అందిస్తున్నారని తెలిపారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా, ప్యాకేజీ ఇస్తామని బీజేపీ మోసం చేసిందని.. వారితో కొన్ని పార్టీలు కుమ్మకై కుట్రలు చేస్తూ, పాదయాత్రలతో మభ్యపెట్టడానికి ప్రయత్నిస్తున్నారని, వారికి గుణపాఠం చెప్పాలని వైసీపీ, జనసేనలపై పరోక్షంగా విమర్శలు సంధించారు. దూరదృష్టితో, జవాబుదారీతనంతో పనిచేస్తున్న చంద్రబాబుకు మద్దతుగా నిలిచి టీడీపీని అధికారంలోకి తీసుకురావాల్సిన చారిత్రక అవసరం ఎంతైనా ఉందని అన్నారు.