జగన్మోహనరెడ్డి ప్రజాసంకల్ప యాత్ర 202వరోజు

Published: Monday July 02, 2018

అమలాపురం,;  à°µà±ˆà°¸à±€à°ªà±€ అధినేత జగన్మోహనరెడ్డి ప్రజాసంకల్ప యాత్ర 202వరోజు ముమ్మిడివరం నియోజకవర్గంలో కొనసాగింది. వర్షంలోనూ జగన్‌ యాత్రను కొనసాగించారు. ముమ్మిడివరం ఎయిమ్స్‌ కళాశాల ప్రాంగణం నుంచి ఆదివారం ఉదయం ప్రారంభమైన జగన్‌ పాదయాత్ర ఐ.పోలవరం మండలంలో సాగింది. రాఘవేంద్ర వారధి మీదుగా మురమళ్ల సెంటర్‌కు చేరుకుంది. భోజన విరామం అనంతరం తిరిగి ప్రారంభమైన పాదయాత్ర సాయంత్రానికి కొమరగిరి మీదుగా పాత ఇంజరం చేరుకుంది. 216 జాతీయ రహదారి పక్కనే ఏర్పాటు చేసిన శిబిరంలో జగన్‌ ఆదివారం రాత్రి బసచేశారు. ఆదివారం సుమారు 12 కిలోమీటర్ల మేర జగన్‌ పాదయాత్రలో పాల్గొన్నారు. పలు సమస్యలపై ఉద్యోగులు, స్థానికులు, ఆక్వా రైతాంగం జగన్‌కు వినతిపత్రాలు అందించారు.