10 లక్షల మందికి నిరుద్యోగ భృతి

Published: Wednesday July 04, 2018
 à°°à°¾à°·à±à°Ÿà±à°°à°‚లో 10లక్షల మందికి ప్రభుత్వం నిరుద్యోగ భృతి ఇవ్వనుంది. కనీస విద్యార్హత డిగ్రీ ఉండి.. 22-35 ఏళ్ల మధ్య ఉన్న నిరుద్యోగులకు నెలకు వెయ్యి రూపాయల చొప్పున ఇవ్వాలని ఇప్పటికే నిర్ణయించింది. à°ˆ పథకం మార్గదర్శకాలపై మంత్రుల కమిటీ సమావేశమైంది. మంత్రులు నారా లోకేశ్‌, కొల్లు రవీంద్రలు మంగళవారం ఇక్కడ ఉన్నతాధికారులతో సమావేశమయ్యారు. నిరుద్యోగ భృతి పొందే యువతీయువకులకు వివిధ శాఖల అనుసంధానంతో నైపుణ్యాభివృద్ధి శిక్షణ ఇవ్వాలని నిర్ణయించారు. నిరుద్యోగ భృతికి నమోదు చేసుకునే సమయంలోనే వారికిష్టమైన మూడు రంగాలను ఎంచుకునే అవకాశం ఇస్తారు. దాని ఆధారంగా పరిశ్రమలకు అవసరమైన ఉద్యోగాలేమిటో చూసి... వాటికి ఎంపికయ్యే విధంగా à°ˆ నైపుణ్యాభివృద్ధి శిక్షణ ఇస్తారు. నైపుణ్యాభివృద్ధితో పాటు పరిశ్రమలతో ఒప్పందం చేసుకుని నిరుద్యోగులను అప్రెంటి్‌సలుగా తీసుకునేలా చూస్తారు.
 
కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న అప్రెంటిస్‌ కార్యక్రమాన్ని వినియోగించుకుంటూ... రాష్ట్ర ప్రభుత్వ అప్రెంటిస్‌ ప్రోత్సాహాన్ని అనుసంధానం చేసి నిరుద్యోగ యువతను పెద్దఎత్తున అప్రెంటీ్‌సలుగా తీసుకుంటారు. మరోవైపు నిరుద్యోగ భృతి అందుకునే యువతీయువకుల వివరాలతో జాబ్‌ పోర్టల్‌ ఏర్పాటు చేస్తారు. దేశవ్యాప్తంగా ఉన్న కంపెనీలకు à°ˆ డేటా అందుబాటులో ఉంచి... ఆయా కంపెనీలు తమకు కావాల్సిన అర్హతలున్నవారిని ఎంపిక చేసుకునే వీలు కల్పిస్తారు. అటు కంపెనీల కోసం, ఇటు యువతీయువకులకు ఉద్యోగాల కల్పన కోసం సులభంగా ఉండేలా ప్రత్యేక మొబైల్‌ యాప్‌ తయారుచేయాలని నిర్ణయించారు.