ముఖ్యమంత్రి చంద్రబాబుది అభివృద్ధి అనుభవం....

Published: Tuesday July 10, 2018
‘ముఖ్యమంత్రి చంద్రబాబుది అభివృద్ధి అనుభవం.. ఆయన 40 ఏళ్ల రాజకీయ అనుభవంలో అభివృద్ధి, సంక్షేమమే కనిపిస్తాయి.. ప్రతిపక్ష నాయకుడు జగన్‌ది 16 నెలల జైలు అనుభవం. జైలులో ఉన్నవారికి ఖైదీలే కనిపిస్తారు’ అని పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి, ఐటీ శాఖల మంత్రి లోకేశ్‌ ఎద్దేవాచేశారు. రెండ్రోజుల పర్యటనలో భాగంగా సోమవారం కర్నూలు నగరంలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఉస్మానియా కాలేజీలో ఏర్పాటు చేసిన ముస్లిం మైనారిటీ మహిళల సమావేశంలో మాట్లాడారు. ‘సంక్షేమం, అభివృద్ధిలో పరుగు పెడుతున్న నవ్యాంధ్రను చూసి కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి కన్నుకుట్టింది. ప్రత్యేక హోదా ఇవ్వకుండా వెన్నుపోటు పొడిచింది.
 
తొలి ఏడాది హోదా ఇస్తామన్నారు. రెండో ఏడాది ఇతర రాష్ట్రాల్లో జరిగే ఎన్నికల తర్వాత ఇస్తామన్నారు. మూడో ఏడాది ఏ రాష్ట్రానికీ హోదా ఇవ్వం.. ఆంధ్రకు ప్రత్యేక ప్యాకేజీ అన్నారు. నాలుగో ఏడాది చివరి బడ్జెట్‌లో ఇతర రాష్ట్రాలకు ప్రత్యేక హోదా ఇచ్చి, మనకివ్వకుండా వెన్నుపోటు పొడిచారు. కడుపు మండి చంద్రబాబు కేంద్రంలోని మన మంత్రులను రాజీనామా చేసి బయటకు రమ్మన్నారు. ఎన్డీఏ నుంచి టీడీపీ వైదొలిగాక బీజేపీ నాయకులకు రాయలసీమ గుర్తుకొచ్చింది. నిజంగా à°† పార్టీ నాయకులకు సీమపై ప్రేమ ఉంటే దేశ రెండో రాజధానిగా కర్నూలును ప్రకటించే దమ్ముందా’ అని నిలదీశారు. జనసేన అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌ నిన్న మొన్నటి దాకా బాగానే ఉన్నారని, గుంటూరు సభ నుంచి యూటర్న్‌ తీసుకుని ఆరోపణలు చేస్తున్నారని అన్నారు. ‘నాపై వ్యక్తిగతంగా పవన్‌ ఆరోపణలు చేశారు. సాక్ష్యాధారాలుంటే జనం ముందు ఉంచాలని మళ్లీ అడుగుతున్నాను. జగన్‌ కేంద్రాన్ని ఒక్క మాట కూడా అనరు. ప్రధాని మోదీని ప్రశ్నించరు.