రాహుల్‌ను కలిసి పార్టీలో చేరిన మాజీ సీఎం
Published: Saturday July 14, 2018

‘కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తేనే ఏపీకి న్యాయం జరుగుతుంది. విభజన చట్టం అమలవుతుంది.. ప్రత్యేక హో దా, ప్రత్యేక రాయితీలు, వివిధ సంస్థల ఏర్పాటు సాధ్యమవుతాయి’ అని మాజీ సీఎం నల్లారి కిరణ్‌కుమార్‌రెడ్డి స్పష్టం చేశారు. ఉమ్మడి ఏపీకి చివరి సీఎంగా పనిచేసిన కిరణ్.. రాష్ట్రాన్ని విభజించాలన్న కాంగ్రెస్ నిర్ణయంతో విభేదించి.. ఆ పార్టీని వీడి జై సమైక్యాంధ్ర పార్టీని స్థాపించిన విషయం తెలిసిందే. ఆంధ్రలో కాం గ్రెస్ ఘోరపరాజయం పాలైంది. పార్టీని తిరిగి బలోపేతం చేసేందుకు తిరిగి ఆయన్ను పార్టీలోకి తీసుకునేందుకు పార్టీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ స్వయంగా మంతనాలు జరిపారు. ఇటీవల ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి ఊమెన్ చాందీ ఆయ న్ను కలిసి సొంతగూటికి రావాలని ఆహ్వానించారు. దాంతో నాలుగేళ్ల విరామం తర్వాత శుక్రవారం ఢిల్లీలో రాహుల్‌ను కలిసి కాంగ్రె్‌సలో చేరారు. ఈ కార్యక్రమంలో చాందీ, పీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి, కేంద్ర మాజీ మంత్రి ఎం.ఎం.పళ్లంరాజు, ఏఐసీసీ కార్యదర్శి క్రిస్టోఫర్ కూడా పాల్గొన్నారు. అనంతరం కిరణ్ విలేకరులతో మాట్లాడారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తేనే రెండు తెలుగు రాష్ట్రాలకు న్యాయం జరుగుతుందని చెప్పారు.
పార్టీలోకి తిరిగి రావడం ఎంతో సంతోషంగా ఉందని, నిజానికి తనకు రాజకీయంగా గుర్తింపునిచ్చిం ది కాంగ్రెసేనని తెలిపారు. తాను, తన తండ్రి 8 సార్లు కాంగ్రెస్ తరపున శాసనసభకు ఎన్నికయ్యామని గుర్తుచేశారు. ‘దేశంలో కాంగ్రెస్ రాహుల్ నాయకత్వంలో బలోపేతం కావడం చరిత్రాత్మక అవసరం. విభజన చట్టం అమలులో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, ప్రతిపక్షా లు ఘోరంగా విఫలమయ్యాయి. నాలుగేళ్లు గడచినా ప్రత్యేక హోదా, రైల్వే జోన్, పోలవరం ప్రాజెక్టు, 11 విద్యా సంస్థల ఏర్పాటు, 2 రాష్ట్రాల్లో ఎయిమ్స్ ఏర్పాటు అమలు కాలేదు. అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్ రాజ్యసభలో ఇచ్చిన హామీలను అమలు చేయాలి. ఏ ప్రభుత్వం అయినా సభలో ప్రధాని ఇచ్చిన హామీలు అమలు చేయాల్సిందే’ అని తెలిపారు. విలేకరుల ప్రశ్నలకు కిరణ్ సమాధానాలివీ..

Share this on your social network: