వైఎస్ హఠాన్మరణంతో అభివృద్ధి నిలిచింది: జగన్
Published: Friday July 20, 2018

వైఎస్ రాజశేఖరరెడ్డి హఠాన్మరణంతో తూర్పు గోదావరి జిల్లాలో అభివృద్ధి నిలిచిపోయిందని వైసీపీ అధినేత వైఎస్ జగన్ అన్నారు. గురువారం ఉదయం 216వ రోజు ప్రజాసంకల్ప యాత్రనుకాకినాడ ఆదిత్య కళాశాల సెంటర్ నుంచి ఆరంభించారు. స్థానిక జేఎన్‌టీయూకే వరకు... సుమారు1.8 కిలోమీటర్లు పాదయాత్ర చేశారు. ఉదయం 9.30కి యాత్ర ముగించారు. అక్కడ నుంచి రాజమహేంద్రవరం చేరుకొని విమానంలో హైదరాబాద్ వెళ్లారు. పాదయాత్రలో మత్య్సకారులు, జగన్‌ను కలిసి వినతిపత్రం అందజేశారు. కుంభాభిషేకం వద్ద హార్బర్ పూర్తి చేయాలని, వంతెన నిర్మాణాన్ని చేపట్టాలని కోరారు.

Share this on your social network: