జగన్‌ ఉచ్చులో చంద్రబాబు

Published: Sunday July 22, 2018

ప్రతిపక్ష నేత జగన్‌ ఉచ్చులో సీఎం చంద్రబాబు, ప్రధాని మోదీ ఉచ్చులో జగన్‌ పడ్డారని మాజీ మంత్రి దగ్గుబాటి వెంకటేశ్వరరావు అన్నారు. రాజకీయ పార్టీలు స్వార్థపూరితంగా వ్యవహరిస్తున్నాయని, కేంద్రంపై ఎదురుదాడి చేసి రాజకీయ లబ్ది పొందాలనుకుంటున్నారని ఆరోపించారు. బంద్‌లు, దీక్షలు, ధర్నాలతో ప్రజలను తప్పుదోవపట్టిస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ప్రభుత్వం వసతులు కల్పించాలని, అనేక విషయాల్లో కేంద్రం డీపీఆర్‌ అడిగితే రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వలేదని వెంకటేశ్వరరావు విమర్శించారు.