కర్నూలులో ఊమెన్‌ చాందీ వ్యాఖ్యలు

Published: Wednesday July 25, 2018
 ‘ఢిల్లీలో జరిగిన కాంగ్రెస్‌ వర్కింగ్‌ కమిటీ సమావేశంలో పది జాతీయ అంశాలను గుర్తించాం. అందులో రెండో అంశం ఏపీకి ప్రత్యేక హోదా. రాహుల్‌గాంధీ ప్రధాని బాధ్యతలు చేపట్టగానే హోదా ఫైలుపైనే తొలి సంతకం చేస్తారు’ అని కాంగ్రెస్‌ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి ఊమెన్‌ చాందీ పేర్కొన్నారు. మంగళవారం కర్నూలులో జరిగిన పార్టీ కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. ‘రాష్ట్ర విభజన వల్ల నవ్యాంధ్రకు అన్యాయం జరిగిన మాట నిజమే. ఆనాడు పార్లమెంటులో ప్రత్యేక హోదా ఇస్తామని నాటి ప్రధాని మన్మోహన్‌ హామీ ఇచ్చారు. 2014 ఎన్నికల్లో అధికారం చేపట్టిన బీజేపీ ఇవ్వకుండా మోసం చేసింది. బీజేపీతో పాటు టీడీపీ, వైసీపీ.. హోదాపై రాజకీయం చేస్తున్నాయి. à°† పార్టీలను నమ్మి మోసపోవద్దు’ అని ప్రజలకు సూచించారు. చట్టంలోని 18 అంశాల అమలు, వెనుకబడిన జిల్లాలకు ప్రత్యేక ప్యాకేజీ, హోదా కాంగ్రె్‌సతోనే సాధ్యమన్నారు. ‘రాష్ట్రంలోనే కాదు.. దేశవ్యాప్తంగా ప్రజలు కాంగ్రెస్‌ వైపు చూస్తున్నారు. రానున్న ఎన్నికల్లో బీజేపీకి తగిన బుద్ధి చెప్పి కాంగ్రె్‌సను గెలిపిస్తారు. ప్రధానిగా రాహుల్‌ బాధ్యతలు చేపట్టడం తథ్యం. 2019 ఆగస్టు 15à°¨ ఎర్రకోటపై ఆయన త్రివర్ణ పతాకం ఎగురవేస్తారు’ అని జోస్యం చెప్పారు.
 
రాహుల్‌ పిలుపు అందుకుని మాజీ సీఎం కిరణ్‌, మాజీ ఎమ్మెల్యే బైరెడ్డి కాంగ్రె్‌సలో చేరారని, ఒక్కొక్కరుగా పార్టీలోకి వస్తున్నారని అన్నారు. రాబోయే ఎన్నికల్లో రాష్ట్రంలో 175 స్థానాల్లో పోటీ చేస్తామని తెలిపారు. పీసీసీ చీఫ్‌ రఘువీరారెడ్డి మాట్లాడుతూ.. 49 ఏళ్ల రాజకీయ అనుభవం ఉన్న ఊమెన్‌ చాందీ సారథ్యంలో రాష్ట్రంలో కాంగ్రె్‌సకు పూర్వ వైభవం వస్తుందన్నారు. తమ హయాంలోనే రూ.3,500కోట్లతో గుండ్రేవుల జలాశయ ని ర్మాణం, రూ.2,600కోట్లతో తుంగభద్ర దిగువకాల్వ ఆధునికీకరణకు డీపీఆర్‌ సిద్ధం చేశామని కేంద్ర మాజీ మంత్రి కోట్ల తెలిపారు.