జనసేనలో చేరుతున్నట్లు రాంబాబు ప్రకటన...

Published: Friday July 27, 2018

మొగల్తూరు శ్రీదేవి జానకీ థియేటర్‌ అధినేత కలిదిండి రాంబాబు గురువారం భీమవరంలో పార్టీ అధినేత పవన్‌ కల్యాణ్‌ను కలిసి జనసేనలో చేరనున్నట్టు తెలిపారు. మొగల్తూరులో వ్యాపారాలు నిర్వహిస్తూ గ్రామంలో సామాజిక సేవా కార్యాక్రమాల్లో తనవంతు సహయం అందిస్తుంటారు. కాంగ్రెస్‌ పార్టీలో చురుగ్గా ఉండే రాంబాబు అనంతరం కొత్తపల్లి సుబ్బారాయుడు ఆధ్వర్యంలో టీడీపీలో చేరారు. సుబ్బారాయుడు వెన్నంటే ఉంటూ ఆయన ఏ పార్టీలో కొనసాగితే అదే పార్టీలో ఉంటూ వచ్చారు. ప్రస్తుతం జనసేన పార్టీలో చేరుతున్నట్టు రాంబాబు ప్రకటించారు.