ఎత్తులు, పైఎత్తులతో రసవత్తరంగా....

Published: Thursday August 02, 2018

ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ రాష్ట్ర రాజకీయం వేడెక్కుతోంది. బహుముఖ పోరుతో రసవత్తరంగా మారుతోంది. ఇప్పటిదాకా అధికార టీడీపీ, విపక్ష వైసీపీ మాత్రమే పోరులో, ప్రచారంలో దూసుకుపోతున్న పరిస్థితి! ఇప్పుడు... కాంగ్రెస్‌ కూడా ‘నేను సైతం’ అంటూ రాష్ట్రంలో ఉనికి చాటుకునేందుకు, కనీస బలం సాధించేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేస్తోంది. బుధవారం విజయవాడలో జరిగిన పీసీసీ విస్తృత స్థాయి సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకుంది. ఇక... రాష్ట్ర ప్రజల దృష్టిలో ‘విలన్‌’గా మారిన బీజేపీ నష్ట నివారణ చర్యలపై దృష్టి సారించింది. ఇవ్వాల్సినవి ఇవ్వకుండా టీడీపీపై విమర్శలతో, ఉత్తుత్తి ప్రకటనలతో ఫలితం ఉండదని కోర్‌ కమిటీ భేటీలో రాష్ట్ర బీజేపీ నేతలు స్పష్టం చేసినట్లు తెలిసింది.