ఆ రాయితీలనే ఎందుకివ్వరు?: గల్లా

Published: Friday August 10, 2018
 à°’కవైపు ప్రత్యేక హోదా ఎవరికీ లేదంటూనే ఈశాన్యరాష్ట్రాలకు ప్రోత్సాహాకాలిస్తూ, ఏపీకి మాత్రం ఎందుకు మొండి చేయి చూపిస్తున్నారని పార్లమెంటు సాక్షిగా కేంద్ర ప్రభుత్వాన్ని టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్‌ నిలదీశారు. రాష్ట్ర విభజనతో తలెత్తిన ఆదాయ వ్యత్యాసాలను సరి చేయాల్సిన కేంద్రం, ఎందుకు ఏపీకి అన్యాయం చేస్తోందని ధాటిగా ప్రశ్నించారు. ‘‘మా రాష్ట్ర ప్రజలు అన్నీ గమనిస్తున్నారు. వాళ్లేమి రాజకీయ చైతన్యం లేని పిచ్చోళ్లు కాదు. వచ్చే ఎన్నికల్లో బుద్ధి చెబుతారు’’ అని హెచ్చరించారు. జీఎస్టీ సవరణ బిల్లుపై గురువారం లోక్‌సభలో జరిగిన చర్చ సందర్భంగా ప్రత్యేక హోదా సహా ఏపీకి చేసిన పలు హామీలను మోదీ సర్కారు ఎలా తుంగలో తొక్కిందనేది సభ దృష్టికి తీసుకొచ్చారు.
 
కేంద్ర ఆర్థిక మంత్రి పీయూష్‌ గోయల్‌ను అంశాలువారీగా నిలదీశారు. ‘‘ఏ రాష్ట్రానికీ ప్రత్యేక హోదా ఇవ్వొద్దని 14à°µ ఆర్థిక సంఘం ఎక్కడా సిఫార్సు చేయలేదు. కానీ, అవిశ్వాస తీర్మానంపై చర్చలో ప్రధాని.. అలా అన్నట్టు చెప్పారు. ఒకవేళ అదే నిజమయితే, జీఎస్టీ బిల్‌ 11క్లాజ్‌, సెక్షన్‌ 22లో ప్రత్యేక హోదా అంశం ఎందుకు పొందుపరిచారు? దానివల్ల రాష్ట్రానికి ప్రత్యేక ప్రయోజనాలు ఉంటాయని ఎందుకు పేర్కొన్నారు. ప్రత్యేక హోదాతో ఎటువంటి ప్రయోజనాలు ఉండవని పేర్కొన్న ఆర్థికమంత్రి, జీఎస్టీలో ప్రత్యేక హోదా ప్రయోజనాల ప్రస్తావన ఎందుకు చేశారు? ఇదే సెక్షన్‌ లో ప్రత్యేక హోదా రాష్ట్రాల ప్రస్తావన చేశారు. ఆర్టికల్‌ 279ఏ(4)(జి) à°•à°¿à°‚à°¦ ఆయా రాష్ట్రాలు ఉంటాయని స్పష్టంగా పేర్కొన్నారు. ఏపీని కూడా à°† ఆర్టికల్‌ చేర్చి, మాకూ అవే ప్రయోజనాలు ఇవ్వాలి’’ అని డిమాండ్‌ చేశారు. ‘‘జీఎస్టీ వచ్చాక ఏపీకి కొత్తగా ఏం చేయలేదు. à°† చట్టం అమలుకు ముందు వెనుకబడిన 150 జిల్లాలతో పాటే ఏపీకీ ప్రోత్సాహకాలు ఇచ్చారు. విభజన చట్టంలోని 94(1),(2) ప్రకారం ఆర్థిక పురోగతి, పారిశ్రామీకరణ కోసం పన్ను రాయితీలు, ప్రోత్సాహకాలు ఇవ్వాలని పేర్కొన్నారు.
 
అయినా 15్% తరుగుదలపై అదనం 15%, పెట్టుబడి అలవెన్స్‌లు 15%ఎక్కువ ఇచ్చారు. అదీ కేవలం 7 వెనుకబడిన జిల్లాలకే పరిమితం చేశారు. కనీసం మిగిలిన జిల్లాల్లోని వెనుకబడిన మండలాల్లోకూడా ఇవ్వలేదు’’ అని మండిపడ్డారు. ప్రత్యేక హోదా రాష్ట్రాల్లో ఇప్పటికేఉన్న 4,324పరిశ్రమలకు రూ.27వేల కోట్లతో బడ్జెట్‌ సపోర్టును 2027వరకు ఇస్తున్నట్లు జూలై 2017లో నోటిఫికేషన్‌ ఇవ్వలేదా అని గల్లా ప్రశ్నించారు. అలాగే, à°ˆ ఏడాది మార్చి 21à°¨ కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ రూ.3వేల కోట్ల మేర à°† రాష్ట్రాల ఆర్థిక వ్యయాన్ని 2020వరకు భరించేందుకు ఆమోదించలేదా, పెట్టుబడి ప్రోత్సాహకాలు, రుణసహకారం, జీఎస్టీ రీయింబర్స్‌మెంట్‌, ఆదాయపన్ను రీయింబర్స్‌మెంట్‌, రవాణా, ఉపాధికల్పన తదితర ప్రోత్సాహకాలు ఇవ్వలేదా అని నిలదీశారు. ఏపీ ప్రస్తావన, ప్రయోజన దృష్టి లేకుండా రూపొందించిన జీఎస్టీ సవరణ బిల్లుకు ఏపీ, టీడీపీ ఎందుకు మద్దతు ఇవ్వాలో చెప్పాలన్నారు.