అప్పుడు ద్రోహి అయిన కాంగ్రెస్...ఇప్పుడు....
Published: Wednesday August 15, 2018

విజయవాడ: చంద్రబాబుది రెండు కళ్ల సిద్దాంతమే అనే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ స్పష్టం చేశారు. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని విజయవాడలోని పార్టీ కార్యాలయంలో కన్నా జాతీయ జెండాను ఎగురవేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్టీఆర్ ఆశయాలకు వ్యతిరేకంగా టీడీపీ పనిచేస్తోందని ఆరోపించారు. చంద్రబాబు తమతో ఉంటూనే కాంగ్రెస్‌తో పొత్తుకు ఆరాటపడుతున్నారని విమర్శించారు. 2014లో కాంగ్రెస్ ద్రోహి అన్న చంద్రబాబుకు...2019కల్లా కాంగ్రెస్ పార్టీ మంచిదైపోయిందా? అని కన్నా నిలదీశారు. చంద్రబాబు అవకాశవాద రాజకీయాలకు ఇదే నిదర్శనమన్నారు. బాండ్లు పేరుతో గొప్పలు చెప్పుకుంటున్న ప్రభుత్వం...ఇటుకల కోసం వసూలు వేసిన డబ్బులు ఏమయ్యాయో చెప్పాలని నిలదీశారు. కేంద్రం ఇచ్చిన నిధులను ఎలా ఖర్చు చేశారో చెప్పాలని కన్నా లక్ష్మినారాయణ డిమాండ్ చేశారు.

Share this on your social network: