రాజకీయ ఊపు ...రోజుకు 3 గంటలు దీనిపైనే ఫోకస్‌

Published: Wednesday August 29, 2018
తెల్లవారుజాము నుంచి రాత్రి పొద్దుపోయేదాకా అధికారిక సమీక్షలతో తలమునకలయ్యే ముఖ్యమంత్రి చంద్రబాబు క్రమక్రమంగా రాజకీయ వేడి పెంచుతున్నారు. మరో 8 నెలల్లో ఎన్నికలు సమీస్తున్న నేపథ్యంలో రాజకీయ కోణంలో సమీక్షలకు సమయం పెంచుతూ వస్తున్నారు. పార్టీ నేతలు, అధికార వర్గాలతో సమావేశమవుతూ ప్రజల నాడి తెలుసుకుంటున్నారు. ‘ఎక్కడ లోటు పాట్లున్నాయి? వాటిని ఎలా సరిదిద్దాలి? ప్రజలకు మరింత దగ్గరయ్యేందుకు ఇంకా ఎలాంటి చర్యలు తీసుకోవాలి?’’ అనే కోణంలో ఆరా తీస్తున్నారు. ఇతర పార్టీల నుంచి చేరికల వంటి నిర్ణయాలు కూడా à°šà°•à°šà°•à°¾ తీసుకుంటున్నారు. కింది స్ధాయిలో బూత్‌ కమిటీలు మొదలుకొని పైస్థాయిలో తన వరకూ అందరూ ప్రజల మధ్య ఉండేలా చూసుకోగలిగితే వచ్చేఎన్నికల్లో తేలిగ్గా విజయం సాధించవచ్చన్న అంచనాతో పార్టీ కార్యకలాపాలపై ‘ఫోకస్‌’ పెంచారు. గతంలో à°…à°°à°—à°‚à°Ÿà°¾ గంటతో సరిపెట్టే రాజకీయ సమీక్షలను ఇప్పుడు రోజూ 2 నుంచి 3 గంటలు నిర్వహిస్తున్నారు.
 
జనంలోనే అధినేత...
వచ్చే ఆరు నెలల్లో కనీసం ఏభై కార్యక్రమాల ద్వారా తాను నేరుగా ప్రజల మధ్య ఉండేలా చంద్రబాబు కార్యాచరణ రూపొందించుకుంటున్నారు. వారంలో రెండు రోజులు జిల్లాల పర్యటనలు ఉండేలా కార్యక్రమం తయారవుతోంది. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా ‘గ్రామదర్శిని’ అమలు చేస్తున్నారు. పార్టీపరంగా ఒకవైపు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, పార్టీ ముఖ్యులు ప్రతి గ్రామం లేదా నివాస ప్రాంతానికి వెళ్లి ప్రజలను కలుసుకొని వారి బాగోగులు తెలుసుకొంటున్నారు. అపరిష్కృతంగా ఉన్న సమస్యలను గుర్తించి వాటిని ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తున్నారు. ప్రభుత్వ అధికారులు కూడా వారానికి రెండు రోజులు ప్రజల్లోకి వెళ్లే కార్యక్రమాన్ని అమలు చేస్తున్నారు.
 
ప్రజా ప్రతినిధులు, అధికారులు నేరుగా ప్రజల వద్దకు వెళ్లి సమస్యలేమిటో తెలుసుకొని వాటిని పరిష్కరించే ప్రయత్నం చేయడం వల్ల ప్రభుత్వం పట్ల సానుకూలత పెరుగుతుందని, ప్రభుత్వ వ్యతిరేకత పలచబడుతుందని టీడీపీ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. ‘గ్రామదర్శిని’పై సీఎం ప్రత్యేక దృష్టి సారించారు. ఒక్కోవారం రెండు నియోజకవర్గాలను ఎంపిక చేసుకొని అక్కడ ప్రజలను కలుస్తున్నారు. సభలో మాట్లాడుతున్నారు. ఎక్కడైనా ఎమ్మెల్యేలు, ఎంపీలు ‘గ్రామదర్శిని’లో చురుగ్గా పాల్గొనడంలేదని సమాచారం అందితే, నేరుగా సీఎం లైన్‌లోకి వస్తున్నారు.
 
త్వరలో ‘గిరిజన’ గర్జన
వర్గాల వారీగా సంక్షేమ కార్యక్రమాలు, పథకాలు à°…à°® లు చేస్తున్న టీడీపీ ప్రభుత్వం వాటిని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ప్రత్యేకంగా సభలు, సమావేశాలు నిర్వహిస్తోంది. ఇప్పటికి దళిత తేజం, ‘నారా హమారా’ పేరిట రెండు భారీ సమావేశాలు ఏర్పాటు చేసింది. దీని తర్వాత ‘గిరిజన గర్జన’ పేరుతో à°’à°• కార్యక్రమం నిర్వహించాలని నిర్ణయించారు. తద్వారా ఆయా వర్గాల వారిని సమీకరించే కృషిలో పార్టీ నేతలు భాగస్వాములవుతారని, à°ˆ కార్యక్రమాలు తెలుగుదేశం పార్టీ à°…à°® లు చేస్తోందన్న ముద్ర వస్తుందని భావిస్తున్నారు. అలాగే రాష్ట్రానికి కేంద్రం చేస్తున్న అన్యాయాన్ని ఎత్తి చూపడానికి ప్రతి జిల్లాలో నెలకొక్కటి చొప్పున నిర్వహిస్తున్న ‘ధర్మ పోరాట సభ’లు నిర్వహిస్తున్నారు. ఇప్పటికి à°ˆ సభలు ఐదు జిల్లాల్లో జరిగాయి. ముగింపులో కృష్ణా, గుంటూరు జిల్లాలకు కలిపి భారీ బహిరంగ సభ నిర్వహిస్తారు. యువత, విద్యార్థుల్లో రాష్ట్ర ప్రభుత్వ పనితీరు, చేస్తున్న కృషిపై అవగాహన కల్పించడానికి ‘జ్ఞాన భేరి’ చేపట్టారు. కింది స్థాయిలో ప్రజలకు ప్రభుత్వాన్ని చేరువ చేయడానికి ప్రభుత్వం కొత్తగా సాధికార మిత్ర వ్యవస్థను రూపొందించింది.