జగన్‌.. నీచ రాజకీయాలు మానుకో....పరిటాల సునీత ఫైర్

Published: Saturday September 01, 2018

అనంతపురం వైద్యం: à°•à±à°Ÿà±à°°à°²à±, గొడవలు, హత్యా రాజకీయాలు ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌కు వెన్నతో పెట్టిన విద్య అని, నీచరాజకీయాలు మానుకోవాలని మంత్రి పరిటాల సునీత మండిపడ్డారు. స్థానిక స్వగృహంలో ఆమె మాట్లాడారు. అమాయకులైన ముస్లింలను అడ్డుపెట్టుకుని కులాల మధ్య చిచ్చుపెట్టాలని చూడటం సిగ్గుచేటన్నారు. గుంటూరులో నారా హమారా... టీడీపీ హమారా సభలో అమాయకులతో ప్లకార్డులు ప్రదర్శించి శాంతిభద్రతలకు విఘాతం కలిగించడం సరికాదన్నారు. గుంటూరు సభ విజయవంతం కాకుండా ఉండేందుకే వైసీపీ ఇలాంటి కుట్రలు పన్నిందని మండిపడ్డారు. తెలుగుదేశం పార్టీ గతంలో ఎవరూ చేయని విధంగా మైనార్టీల అభివృద్ధికి ఎంతో కృషి చేస్తోందన్నారు. అందుకే గుంటూరు సభకు లక్షలాది మంది తరలివచ్చారని చెప్పారు. దీన్ని చూసి ఓర్వలేక కొంత మంది యువతను ఉసిగొల్పి సభలో గొడవకు కారకులయ్యారన్నారు. టీడీపీకి వెన్నంటే ఉన్న మైనార్టీలను దూరం చేసేందుకు వైసీపీ ఇలాంటి కుట్ర రాజకీయాలు చేసిందన్నారు. ఇలాంటి జిమ్మక్కులను ముస్లింలు నమ్మరని, వచ్చే ఎన్నికల్లో వారే తగినబుద్ధి చెప్తారని హెచ్చరించారు.