తమిళనాడు బీజేపీ చీఫ్‌కు ఎయిర్‌పోర్టులో ఊహించని అనుభవం

తమిళనాడు బీజేపీ చీఫ్ సౌందరరాజన్‌కు టుటికోరిన్ ఎయిర్‌పోర్టులో ఊహించని అనుభవం ఎదురైంది. బీజేపీకి వ్యతిరేకంగా ఓ ప్రయాణికురాలు నినాదాలు చేయడంతో ఆమెకు, సౌందరరాజన్‌కు మధ్య తీవ్ర వాగ్యుద్ధం చోటుచేసుకుంది. ''ఫాసిస్టు బీజేపీ ప్రభుత్వం డౌన్.. డౌన్..'' అంటూ తోటి ప్రయాణికురాలు నినాదాలు చేసినట్టు సమాచారం. దీంతో ఆగ్రహానికి గురైన సౌందరరాజన్ ఆమెతో వాగ్యుద్ధానికి దిగినట్టు చెబుతున్నారు. అనంతరం ఆమె ఎయిర్‌పోర్టు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో సదరు ప్రయాణికురాలిని దర్యాప్తు నిమిత్తం అదుపులోకి తీసుకున్నారు.
ఈ వ్యవహారంపై సౌందరరాజన్ మీడియా ముందు స్పందిస్తూ... ''మధ్య వయస్కురాలైన ఓ మహిళ నన్ను చూడగానే బీజేపీకి వ్యతిరేకంగా నినాదాలు చేయడం మొదలు పెట్టింది. ప్రవేశ ద్వారం వరకు నన్ను వెంబడించింది. ఆమె ప్రవర్తన ప్రమాదకరంగా కనిపించింది. ఆమె ఇలా చేయడం వెనుక ఎవరో ఉన్నారని భావిస్తున్నాను..'' అని పేర్కొన్నారు.

Share this on your social network: