పోలవరంపై విషం చిమ్ముతున్నారు

Published: Saturday September 08, 2018
 à°¤à°¨ రాజకీయ చరిత్రలో ఇలాంటి ప్రతిపక్ష నేతను చూడలేదని వైసీపీ అధ్యక్షుడు జగన్‌పై సీఎం చంద్రబాబు విరుచుకుపడ్డారు. సాగునీటి ప్రాజెక్టులను అడ్డుకునేలా కుట్రలు పన్నుతూ దుర్మార్గంగా వ్యవహరిస్తున్నారని ధ్వజమెత్తారు. శాసనసభలో శుక్రవారం నదుల అనుసంధానంపై జరిగిన లఘు చర్చలో ఆయన మాట్లాడారు. ‘ప్రజా సమస్యలపై శాసనసభ వేదికగా ప్రతిపక్షం చర్చించాలి. అలా కాకుండా ఎవరిమీదో నెపం పెట్టి అసెంబ్లీ సమావేశాలకు దూరంగా పారిపోతున్నారు. బయట రోడ్లపై ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారు. పోలవరం ప్రాజెక్టు పూర్తికాకుండా అడ్డుకునేందుకు జాతీయ హరిత ట్రైబ్యునల్‌ (ఎన్‌జీటీ) నుంచి సుప్రీంకోర్టు దాకా కేసులు వేస్తున్నారు. పోలవరం ప్రాజెక్టు పూర్తి కాదనుకున్నారు.
 
కానీ వేగంగా పూర్తవుతుంటే తట్టుకోలేకపోతున్నారు. కుడి ప్రధాన కాలువకు à°—à°‚à°¡à°¿ కొట్టారు. పట్టిసీమ, పురుషోత్తపట్నం ఎత్తిపోతల పథకాలు పూర్తయితే.. రాయలసీమ, ఉత్తరాంధ్రకు గోదావరి జలాలు తరలిపోతాయని.. మీ జిల్లాలకు నీళ్లుండవంటూ ఉభయ గోదావరి రైతులను రెచ్చగొట్టే ప్రయత్నం చేశారు. సముద్రంలోకి వృఽథాగా పోయే నీటినే ఇతర ప్రాంతాలకు తరలిస్తానని.. రాష్ట్రంలోని 13 జిల్లాల్లో తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాలే నాకు మొదటి రెండు ప్రాధాన్యాలని రైతాంగానికీ, ప్రజా ప్రతినిధులకూ స్పష్టం చేశాను. వారు విశ్వసించారు’ అని తెలిపారు. పట్టిసీమ నిర్మాణ సమయంలోనూ భూసేకరణకు అడ్డుపడ్డారని.. రైతులను ఒప్పించడంతో సమస్య పరిష్కారమైందని చెప్పారు. ‘పురుషోత్తపట్నం పథకం విషయంలో న్యాయస్థానాల్లో కేసులు వేయించారు. పుట్టపర్తిలో కేవలం కొన్ని ఎకరాల విషయంలో సుప్రీంకోర్టు దాకా తీసుకెళ్లారు’ అని చెప్పారు. పోలవరం నిర్మాణం పనులకు సంబంధించి కేంద్రం నుంచి ఇంకా రూ.2,700 కోట్లు రావాలన్నారు.
 
తుది అంచనా సవరణలకు ఆమోద ముద్ర వేయాలంటూ కేంద్ర మంత్రి నితిన్‌ గడ్కరీ ప్రాజెక్టు ప్రాంతానికి వచ్చినప్పుడు కోరానని, దానికి ఆయన సమ్మతించి కేంద్ర జల సంఘం బృందాన్ని పంపారని,, పనులు భేషుగ్గా జరుగుతున్నాయని à°ˆ బృందం అభినందించి.. కొన్ని సూచనలు చేసిందని తెలిపారు. వాస్తవం ఇలా ఉంటే.. జగన్‌ తన సొంత ప్రసార సాధనాల్లో విషం చిమ్మారని.. నాసిరకం సిమెంటు వాడుతున్నామంటూ ప్రజల్లో అనుమానాలు రేకిత్తించేలా కుట్ర పన్నుతున్నారని మండిపడ్డారు. ‘డయాఫ్రం వాల్‌ నిర్మాణం పూర్తయితే.. చైనా గోడ నిర్మించినంతగా సంబరపడిపోతున్నానంటూ జగన్‌ నాపై విమర్శలు చేశారు. ఏ నీటి ప్రాజెక్టుకైనా డయాఫ్రం వాల్‌ జీవనాధారం. దీని నిర్మాణంలో ఏమాత్రం లోపమున్నా అడుగున కోత ఏర్పడి నీళ్లు వెళ్లిపోతాయి. ప్రాజెక్టులపై ఆయనకు ఏమాత్రం అవగాహన లేదనేందుకు ఇదే ప్రత్యక్ష ఉదాహరణ. ఉభయగోదావరి జిల్లాల్లో పర్యటించినప్పుడు జగన్‌ పోలవరం/పట్టిసీమ/ పురుషోత్తపట్నం ప్రాజెక్టులను ఎందుకు పరిశీలించలేదు’ అని నిలదీశారు. కుప్పం కంటే ముందే పులివెందులకు నీళ్లిస్తానని à°•à°¡à°ª జిల్లా వాసులకు మాటిచ్చానని గుర్తుచేశారు.
 
‘రైతులు పేదరికంలో ఉంటేనే తన మాట వింటారని భావిస్తున్నారు. కానీ ఎవరేమనుకున్నా పులివెందులకు నీళ్లిస్తానని ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటాను. à°† తర్వాతే కుప్పం నియోజకవర్గానికి నీరు తరలిస్తాను’ అని స్పష్టం చేశారు. పట్టిసీమ ఎలా పూర్తవుతుందో చూస్తానని వైసీపీ నేత పార్థసారథి సవాల్‌ చేశారని.. పూర్తయితే రాజకీయ సన్యాసం చేస్తానని చెప్పారని.. మూడేళ్లయినా ఇంకా రాజకీయాల్లోనే ఉన్నారని చెప్పారు. ‘రాష్ట్రంలో ఏదైనా సాగునీటి ప్రాజెక్టు పూర్తవుతుందంటే సీనియర్‌ నేతగా సభాపతి కోడెల శివప్రసాదరావు ఆనందపడతారు. పోలవరం ప్రాజెక్టుపైనా అదేవిధంగా సంతోషపడ్డారు. కానీ కాంగ్రెస్‌ ఎంపీ కేవీపీ ఆయనకు లేఖలు రాయడం దుర్మార్గం’ అని ఆగ్రహం వ్యక్తం చేశారు.