సానుభూతి కోసమే కోడికత్తి డ్రామా

Published: Tuesday November 20, 2018

‘‘ముద్రగడ పద్మనాభం కాపులను బీసీల్లో ఏ పార్టీ చేరిస్తే à°† పార్టీకి మద్దతిస్తామని ప్రకటన చేశారు. టీడీపీ ప్రభుత్వం కాపులను బీసీల్లో చేరుస్తూ అసెంబ్లీలో తీర్మానం చేసింది. కేంద్ర ప్రభుత్వానికి పంపింది. కాబట్టి ముద్రగడ à°ˆ ఎన్నికల్లో టీడీపీకి అనుకూలంగా స్పందిస్తారనే ఆశిస్తున్నాం’’ అని హోం మంత్రి చినరాజప్ప అన్నారు. గుంటూరు జిల్లా వినుకొండలో మాట్లాడుతూ, ‘‘ప్రతిపక్షనేత జగన్‌పై కాపులకు నమ్మకం లేదు. కోడికత్తి కేసులో పోలీసులకు కనీసం ఫిర్యాదు కూడా చేయలేదు. ఇంతవరకు సంఘటన జరిగినప్పటి చొక్కాను కూడా పోలీసులకు అందజేయలేదు. పూర్తి వివరాలు త్వరలోనే వస్తాయి’’ అన్నారు. శ్రీకాకుళం జిల్లా టెక్కలిలో మంత్రి అచ్చెన్న మాట్లాడుతూ, ‘‘ప్రజల విశ్వాసం కోల్పోయిన జగన్‌ సానుభూతి కోసం కోడికత్తి డ్రామా ఆడుతున్నారు’’ అని మండిపడ్డారు. ఎంపీ రామ్మోహన్‌ నాయుడు మాట్లాడుతూ, ‘‘తితలీ బాధితుల పరామర్శకు రాని జగన్‌.. ఏ ముఖం పెట్టుకొని పాదయాత్రకు వస్తున్నారు’’ అని అన్నారు.